టీ20 చ‌రిత్ర‌లో మునుపెన్న‌డూ చూడ‌ని ర‌నౌట్‌! | Tilak Varma Casual Walk Leads To Unbelievable Run Out After West Indies Boundary Save In 3rd T20I, Watch Video Goes Viral: తిల‌క్ వ‌ర్మ ఔట‌య్యే స‌మ‌యానికి 16 బంతుల్లో 28 ప‌రుగుల‌తో ఆడుతున్నాడు. అత‌డు ఔట్ కాక‌పోయుంటే భార‌త్ స్కోరు 250 క‌చ్చితంగా దాటేదేమోన‌ని అభిమానులు త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. బౌండ‌రీ వ‌స్తుంద‌నుకుంటే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా తిల‌క్ వ‌ర్మ ర‌నౌట్ కావ‌డం గ‌మ‌నార్హం. | Sakshi
Sakshi News home page

IND Vs WI: టీ20 చ‌రిత్ర‌లో మునుపెన్న‌డూ చూడ‌ని ర‌నౌట్‌!

Oct 12 2026 11:08 AM | Updated on Oct 12 2026 11:20 AM

Tilak Varma-Casual-Walk-Costs-Wicket Never-Seen Run Out-T20s-History

Photo Credit : Twitter

ఇండోర్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా బ్యాట‌ర్ తిల‌క్ వ‌ర్మ ఔటైన విధానం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తిల‌క్ వ‌ర్మ ర‌నౌటైన తీరు చూస్తే అది అత‌డి నిర్ల‌క్ష్య వైఖ‌రి అనాలా? లేక బ్యాడ్‌ల‌క్ అనాలా అర్థం కావ‌డం లేదు. విష‌యంలోకి వెళితే.. విండీస్ బౌల‌ర్ గుద‌కేశ్ మోతీ వేసిన 17వ ఓవ‌ర్లో స్ట్రైక్‌లో ఉన్న అక్ష‌ర్ ప‌టేల్ డీప్ మిడ్ వికెట్ మీదుగా బంతిని బౌండ‌రీ త‌ర‌లించాడు. 

అయితే అక్క‌డే ఉన్న ఫీల్డ‌ర్ క‌మిల్ పూర‌న్ బంతి రోప్‌ను తాక‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నంలో డైవ్ చేశాడు. అయితే బంతిని ఆపే ప్ర‌య‌త్నంలో పూర‌న్ బౌండ‌రీ తాడును తాకాడ‌ని, అందువ‌ల్ల అది ఫోర్ అని తిల‌క్‌, అక్ష‌ర్ ప‌టేల్ భావించారు. ఫోర్ వ‌చ్చింద‌న్న భ్ర‌మ‌లో సింగిల్ పూర్తి చేసిన అనంత‌రం ఇద్ద‌రు త‌మ వైపున‌కు నింపాదిగా న‌డుచుకుంటూ వెళ్లారు. 

అంత‌లోనే పూర‌న్ నుంచి బంతి అందుకున్న షెయ్ హోప్ బెయిల్స్ ఎగుర‌గొట్టే ప్ర‌య‌త్నం చేయ‌గా, అక్ష‌ర్ అప్ప‌టికే క్రీజులోకి చేరుకున్నాడు. దీంతో హోప్ బంతిని నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు ఉన్న మోతీవైపుకు విసిరాడు. అయితే అప్ప‌టికీ తిల‌క్ వ‌ర్మ క్రీజులోకి రాక‌పోవ‌డాన్ని గ‌మ‌నించిన మోతీ బంతితో వికెట్ల‌ను గిరాటేశాడు. 

బౌండ‌రీ ఇవ్వాలా వ‌ద్దా అని నిర్ణ‌యించడానికి థర్డ్ అంపైర్ రివ్యూ కోర‌గా, పూర‌న్ అసాధార‌ణ ఫీల్డింగ్‌తో బౌండ‌రీ రాక‌పోగా తిల‌క్ వ‌ర్మ రనౌట్ అయిన‌ట్లు డిస్‌ప్లేపై క‌నిపించింది. దీంతో తిల‌క్ వ‌ర్మ షాక్‌కు గుర‌య్యాడు. కానీ రూల్స్ ప్ర‌కారం తాను ఇంకా క్రీజులోకి రాక‌పోవ‌డంతో ఏమీ చేయ‌లేక నిరాశ‌తో తిల‌క్‌ పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. 

దీంతో భార‌త్‌కు బౌండ‌రీ రావాల్సిన చోట ఫీల్డ‌ర్ చేసిన పనికి విండీస్‌కు వికెట్ ల‌భించిన‌ట్ల‌యింది. తిల‌క్ వ‌ర్మ ఔట‌య్యే స‌మ‌యానికి 16 బంతుల్లో 28 ప‌రుగుల‌తో ఆడుతున్నాడు. అత‌డు ఔట్ కాక‌పోయుంటే భార‌త్ స్కోరు 250 క‌చ్చితంగా దాటేదేమోన‌ని అభిమానులు త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. బౌండ‌రీ వ‌స్తుంద‌నుకుంటే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా తిల‌క్ వ‌ర్మ ర‌నౌట్ కావ‌డం గ‌మ‌నార్హం. 

దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ్యాచ్ విష‌యానికొస్తే అభిషేక్ శ‌ర్మ (69), ఇషాన్ కిష‌న్ మెరుపుల‌తో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 223 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం వెస్టిండీస్ ల‌క్ష్య ఛేద‌న‌లో 14 ప‌రుగుల దూరంలో ఆగిపోవ‌డంతో భార‌త్ విజ‌యాన్ని అందుకుంది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరుజ‌ట్ల మ‌ధ్య నాలుగో టీ20 హైద‌రాబాద్ వేదిక‌గా బుధ‌వారం జ‌ర‌గ‌నుంది.

ఇదీ చ‌ద‌వండి:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement