మెల్‌బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ఇటలీ స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ బరిలోకి దిగడంలేదు. ఈ విషయాన్ని ఆ్రస్టేలియన్ ఓపెన్ నిర్వాహకులు గురువారం అధికారికంగా ప్రకటించారు. సినెర్‌కు ఇటీవల కుడి మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరింత సమయం పట్టనున్న నేపథ్యంలో సినెర్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌కు దూరమయ్యాడు.
ఈ ఏడాది జూలైలో వింబుల్డన్ టోర్నీలో టైటిల్ నిలబెట్టుకున్న తర్వాత సినెర్ మరో టోర్నీలో ఆడలేదు. 2027 ఆ్రస్టేలియన్ ఓపెన్ జనవరి 17 నుంచి జరుగుతుంది. ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సినెర్‌కు మంచి రికార్డు ఉంది. ఏడుసార్లు అతను ఈ టోర్నీలో పాల్గొని రెండుసార్లు (2024, 2025) విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా 27 మ్యాచ్‌ల్లో గెలిచి, ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు.


