బాధితుడితో వైద్యులు, నర్సింగ్ ఆఫీసర్లు
సాక్షి హైదరాబాద్: మూసుకుపోయిన శ్వాసనాళ భాగాన్ని తొలగించి, యువకునికి పునర్జన్మ ప్రసాదించారు సికింద్రాబాద్ గాం«దీఆస్పత్రి వైద్యులు. సూపరింటెండెంట్ ప్రొ.ఉషారాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రొ.సునీల్కుమార్, కార్డియోథోరాసిస్ హెచ్ఓడీ ప్రొ.రవీంద్రలు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లికి చెందిన సందీప్ 2018లో పురుగుల మందు తాగి ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా శ్వాసనాళానికి రంధ్రం చేశారు.
ఏడాది తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కాగా కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో చేరాడు. ఏడుసార్లు డిలటేషన్(వ్యాకోచం) చేసినా శ్వాసనాళం సరికాలేదు. టీ ఆకారంలోని సిలికాన్ ట్యూబ్ను వేసినా నాలుగేళ్ల తర్వాత మొదటికి వచి్చంది. శ్వాసనాళానికి మరోసారి రంధ్రం చేయడానికి రూ.8 లక్షలు అవుతుందని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చెప్పడంతో బాధితుడు గాం«దీఆస్పత్రిని ఆశ్రయించాడు. 95శాతం మూసుకుపోయిన శ్వాసనాళానికి తక్షణమే సర్జరీ చేయకుంటే ప్రాణాలకే ప్రమాదమని నిర్ధారించారు.
గతనెల 30వ తేదీన కారి్థయోథోరాసిస్ హెచ్ఓడీ ప్రొ.రవీంద్ర నేతృత్వంలో ఈఎన్టీ, అనస్టీíÙయా వైద్యులు పద్మలత, రాజశేఖర్, నాగరాజు, రామ్జీ, మురళీధర్, సుచరితలు.. మూసుకుపోయిన నాలుగు సెంటీమీటర్ల శ్వాసనాళాన్ని తొలగించి సరిచేశారు. కోలుకోవడంతో శనివారం డిశ్చార్జీ చేశారు. వైద్యులను డీఎంఈ వాణి, గాంధీ సూపరింటెండెంట్ ఉషారాణి, ప్రిన్సిపాల్ ఇందిర, డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్కుమార్లు అభినందించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా శస్త్రచికిత్సను ఉచితంగా నిర్వహించడం గమనార్హం.
ఇదీ చదవండి: దసరా షాపింగ్కు రెడీనా? నగరంలో ఆఫర్లే ఆఫర్లు! అవేంటంటే?


