టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా | Ind vs Nz 2nd Test Toss Update | Sakshi
Sakshi News home page

Ind vs Nz 2nd Test: రెండో టెస్టులో టాస్ గెలిచిన భారత్.. తుది జట్టు ఇదే

Nov 27 2026 3:15 AM | Updated on Nov 27 2026 3:16 AM

Ind vs Nz 2nd Test Toss Update

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా చివరిది అయిన రెండో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. క్రైస్ట్ చర్చ్ వేదిక. ఈ మ్యాచ్‌తో గూర్నూర్ బ్రార్.. టెస్టుల్లోకి అరంగేట్రం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బూమ్రా.. అతడికి క్యాప్ అందజేశాడు. కొన్నిరోజుల క్రితం జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో స్థానం మెరుగుపరుచుకోవాలంటే భారత జట్టుకి ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం.

రెండో టెస్టుకి తుది జట్లు

టీమిండియా: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్, బుమ్రా, గుర్నూర్ బ్రార్

న్యూజిలాండ్: టామ్ లేథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, హెన్రీ నికోలస్, రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్, టామ్ బ్లండల్, గ్లెన్ ఫిలిప్స్, నాథన్ స్మిత్, కైలీ జెమిసన్, మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫ్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement