సత్తా చాటిన అభిషేక్‌, తిలక్‌.. టీమిండియా భారీ స్కోర్‌ | ACC Mens Asia Cup Rising Stars 2026 1st semi final IND A VS SL A: Abhishek, Tilak shines. team india scored huge | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన అభిషేక్‌, తిలక్‌.. టీమిండియా భారీ స్కోర్‌

Nov 26 2026 7:07 PM | Updated on Nov 26 2026 7:12 PM

ACC Mens Asia Cup Rising Stars 2026 1st semi final IND A VS SL A: Abhishek, Tilak shines. team india scored huge

source: X

ఏసీసీ మెన్స్‌ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ 2026 టోర్నీలో భాగంగా శ్రీలంక-ఎతో ఇవాళ జరుగుతున్న తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత-ఎ జట్టు భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది.

ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (78), కెప్టెన్‌ తిలక్‌ వర్మ (53), మిడిలార్డర్‌ బ్యాటర్‌ షాబాజ్‌ అహ్మద్‌ (54 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించగా.. చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (40) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. మిగతా ప్లేయర్లలో కుమార్‌ కుషాగ్రా 21, రింకూ సింగ్‌ 12, సూర్యాంశ్‌ షేడ్గే 10, తనుశ్‌ కోటియన్‌ 28, హర్ష్‌ దూబే 8 (నాటౌట్‌) పరుగులు చేశారు. లంక బౌలర్లలో రవిందు ఫెర్నాండో, జనిత్‌ లియనాగే, నిపున్‌ ధనుంజయ తలో 2 వికెట్లు పడగొట్టగా.. గరుక సంకేత్‌, లహీరు సమరకూన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

మరోసారి బ్యాట్‌ ఝులిపించిన వైభవ్‌
ఈ టోర్నీలో వైభవ్‌ సూర్యవంశీ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. యూఏఈతో జరిగిన చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో వర్ణించలేని విధ్వంసాన్ని సృష్టించిన అతడు.. శ్రీలంక-ఎతో ఇవాళ జరుగుతున్న తొలి సెమీఫైనల్లో ఓ మోస్తరు విధ్వంసంతో సరిపెట్టాడు. ఈ మ్యాచ్‌లోనూ భారీ విధ్వంసం ఖాయమనుకున్న తరుణంలో జనిత్‌ లియనాగే బౌలింగ్‌లో లసిత్‌ క్రూస్‌పుల్లేకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

యూఏఈతో జరిగినమ్యాచ్‌లో వైభవ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి రికార్డు డబుల్‌ సెంచరీ (53 బంతుల్లో 204; 7 ఫోర్లు, 28 సిక్సర్లు)తో విరుచుకుపడ్డాడు. ఈ విధ్వంసం ధాటి​కి లిస్ట్‌-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ, 150, డబుల్‌ సెంచరీ.. ఇలా చాలావరకు బ్యాటింగ్‌ రికార్డులు బద్దలయ్యాయి.

సత్తా చాటిన అభిషేక్‌
ఈ టోర్నీలో తనదైన మార్కు చూపించలేకపోయిన అభిషేక్‌, శ్రీలంకతో జరుగుతున్న కీలక సెమీఫైనల్లో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో తన సహజ శైలిలో భిన్నంగా బ్యాటింగ్‌ చేసిన అభిషేక్‌ సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే దురదృష్టవశాత్తు లహీరు సమరకూన్‌ బౌలింగ్‌లో జనిత్‌ లియనాగేకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

ఇదీ చదవండి: సంచలనం సృష్టించిన సెహ్వాగ్‌ చిన్న కుమారుడు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement