‘మా జట్టులో ఆడతావా’ | Club cricket team offer for Pant | Sakshi
Sakshi News home page

‘మా జట్టులో ఆడతావా’

Nov 27 2026 4:28 AM | Updated on Nov 27 2026 4:28 AM

Club cricket team offer for Pant

పంత్‌కు క్లబ్‌ క్రికెట్‌ టీమ్‌ ఆఫర్‌

26 బంతుల్లో 72 పరుగులు చేసిన భారత కీపర్‌ 

క్రైస్ట్‌చర్చ్‌: మైదానంలో చెలరేగడమే కాకుండా స్టంప్స్‌ వెనక నుంచి తన సరదా కబుర్లతో, భిన్నమైన శైలితో రిషభ్‌ పంత్‌ ప్రత్యేకంగా కనిపిస్తాడు. అతని ఫ్రెండ్లీ వ్యక్తిత్వానికి సంబంధించిన మరో ఉదాహరణ ఇది. రెండో టెస్టు వేదిక అయిన క్రైస్ట్‌చర్చ్‌లో అతను సరదాగా ఎలక్ట్రిక్ బైక్‌పై తిరుగుతూ హాగ్లీ పార్క్‌ గ్రౌండ్‌ వద్దకు వచ్చాడు. ఇంతలో అక్కడి నుంచి వచ్చిన ఒక వ్యక్తి పంత్‌ను గుర్తు పట్టాడు. ముందుగా మాట్లాడి సెల్ఫీలు తీసుకున్న అతను ఆ తర్వాత ‘మా క్రికెట్‌ టీమ్‌లో ఒక ప్లేయర్‌ తక్కువగా ఉన్నాడు. నువ్వు ఆడతావా’ అని అడిగాడు. మరొకరైతే తన స్థాయి గురించి ఆలోచించేవారేమో. 

కానీ పంత్‌ అలా కాదు కదా! వెంటనే నేను రెడీ అంటూ మైదానంలోకి వచ్చేశాడు. ‘స్టాన్‌ స్టాన్‌’ అనే మారు పేరుతో అతను బరిలోకి దిగాడు. ‘ద చూజెన్‌ వన్స్‌’ టీమ్‌తో జరిగిన ఈ ‘ఎయిట్‌–ఎ–సైడ్‌’ టి20 క్లబ్‌ మ్యాచ్‌లో అతను ‘ఓపెన్‌ హౌస్‌ స్వింగర్స్‌’కు ప్రాతినిధ్యం వహించాడు. తనదైన శైలిలో చెలరేగి 26 బంతుల్లోనే 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 72 పరుగులు బాది రనౌటయ్యాడు. టీమ్‌లోకి తీసుకున్న స్వింగర్స్‌ జట్టు ఆటగాళ్లకు మాత్రమే పంత్‌ గురించి తెలియగా... ప్రత్యర్థి టీమ్‌ మాత్రం అతడిని గుర్తించలేదు! బౌలింగ్‌ కూడా చేసిన పంత్‌ 4 ఓవర్లలో 55 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీయగా, చివరకు అతని టీమ్‌ 3 వికెట్ల తేడాతో ఓడింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement