PC: BCCI/X
ఐపీఎల్-2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తిరిగి నియమితుడయ్యాడు. ఈ మేరకు ముంబై ఇండియన్స్ మేనెజ్‌మెంట్ ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు ట్రేడ్ కావడంతో రోహిత్‌కు తిరిగి జట్టు పగ్గాలను ఎంఐ యాజమాన్యం కట్టబెట్టింది.
ముంబై కెప్టెన్‌గా రోహిత్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. రోహిత్ శర్మ సారథిగా ముంబై జట్టును ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. అయితే 2024 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకున్న ముంబై యాజమాన్యం.. రోహిత్‌ను తప్పించి అతడికి పగ్గాలు అప్పగించింది.
దీంతో ముంబై తీసుకున్న నిర్ణయంపై తీవ్ర స్ధాయిలో విమర్శలు వ్యక్తమమయ్యాయి. అయినప్పటికి హార్దిక్‌ను మూడు సీజన్ల పాటు ముంబై తమ కెప్టెన్‌గా కొనసాగించింది. కానీ హార్దిక్ సారథ్యంలో ముంబై ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. గత మూడు సీజన్లలో కేవలం ఒక్కసారి మాత్రమే ముంబై ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలోనే ముంబై యాజమాన్యం అతడిని పంజాబ్ ట్రేడ్ చేసి.. రోహిత్‌ను తిరిగి కెప్టెన్‌గా నియమించింది.
Smile, everybody smile 💙 #MumbaiIndians #CaptainRo https://t.co/YUqYZTQxu9
— Mumbai Indians (@mipaltan) November 27, 2026


