108 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్‌ | AUS vs ENG 3rd T20I: Jamie Overtons Five-For Bundles Australia Out for 108 | Sakshi
Sakshi News home page

AUS vs ENG 3rd T20I: 108 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్‌

Nov 27 2026 3:51 PM | Updated on Nov 27 2026 4:01 PM

AUS vs ENG 3rd T20I: Jamie Overtons Five-For Bundles Australia Out for 108

బ్రిస్బేన్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్లు చేతులెత్తేశారు.  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ జట్టు.. ఇంగ్లీష్ బౌలర్ల ధాటికి 16.5 ఓవర్లలోనే కేవలం 108 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాటర్లలో సామ్ హార్పర్ (14 బంతుల్లో 26), జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (11 బంతుల్లో 22) మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించారు.

కెప్టెన్ మిచెల్ మార్ష్‌(11)తో సహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బ్యాటర్లకు ఇంగ్లండ్ పేసర్ జేమీ ఓవర్టన్ చుక్కలు చూపించాడు. ఓవర్టన్ తన 4 ఓవర్ల కోటాలో కేవలం 12 పరుగులిచ్చి 5 వికెట్లు  పడగొట్టి ఆసీస్ వెన్నువిరిచాడు.

అతడితో పాటు స్పిన్నర్ లియామ్ డాసన్ 3 ఓవర్లలో 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. కాగా ఈ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. తొలి టీ20లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో, రెండో టీ20లో ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో గెలిచాయి. కాగా ఆసీస్‌కు సొంత గడ్డపై టీ20ల్లో ఇదే అత్యల్ప స్కోర్‌ కావడం గమనార్హం.

సొంత గ‌డ్డపై టీ20ల్లో ఆసీస్ న‌మోదు చేసిన స్వ‌ల్ప స్కోర్లు ఇవే
108 - ఇంగ్లండ్‌- బ్రిస్బేన్, 2026*
111 - న్యూజిలాండ్- సిడ్నీ, 2022
119 - భారత్‌తో- 2025
127 - పాకిస్థాన్‌తో, మెల్‌బోర్న్, 2010
చదవండి: అతడొక అద్భుత బౌలర్‌.. కానీ అదొక్కటే సమస్య: దినేశ్‌ కార్తీక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement