బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జేమీ ఓవర్టన్ నిప్పులు చెరిగాడు. తన అద్భుత బౌలింగ్‌తో ఆసీస్ బ్యాటర్లకు ఓవర్టన్ చుక్కలు చూపించాడు. అతడి బౌలింగ్ ధాటికి ఆతిథ్య జట్టు టాపార్డర్ కకావికలం అయింది.
ఓవర్టన్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 12 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసీస్ 16.5 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. ఈ నేపథ్యంలో ఓవర్టన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
ఇంగ్లండ్ తరఫున టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇవే
5/10 - సామ్ కర్రన్ (వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, పెర్త్, 2022)
5/12 - జేమీ ఓవర్టన్ (వర్సెస్ ఆస్ట్రేలియా, బ్రిస్బేన్, 2026)
4/2 - ఆదిల్ రషీద్ (వర్సెస్ వెస్టిండీస్, దుబాయ్, 2021)
4/6 - క్రిస్ జోర్డాన్ (వర్సెస్ వెస్టిండీస్, బస్సెటెర్రే, 2019)
4/7 - డేవిడ్ విల్లీ (వర్సెస్ వెస్టిండీస్, బస్సెటెర్రే, 2019)
👉అదేవిధంగా ఓవరాల్‌గా ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాపై టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గా ఓవర్టన్ నిలిచాడు.
6/16 - అజంతా మెండిస్ (శ్రీలంక, పల్లెకెలె, 2011)
5/12 - జేమీ ఓవర్టన్ (ఇంగ్లాండ్, బ్రిస్బేన్, 2026)
5/18 - మహ్మద్ నవాజ్ (పాకిస్తాన్, లాహోర్, 2026)
4/8 - ఉమర్ గుల్ (పాకిస్తాన్, దుబాయ్, 2009)
అలాగే బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో అత్యుత్తమ టీ20 గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా ఓవర్టన్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ మైదానంలో అతడి కంటే ముందు ఎవరు కూడా 5 వికెట్ల హాల్ సాధించలేదు.
బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో అత్యుత్తమ టీ20 గణాంకాలు నమోదు చేసిన బౌలర్లు వీరే
5/12 - జేమీ ఓవర్టన్ (ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా, 2026)
4/20 - మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా వర్సెస్ విండీస్, 2022)
3/9 - నాథన్ ఎల్లిస్ (ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్, 2024)
ఇంగ్లండ్ ఘన విజయం
కాగా ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా ఇంగ్లండ్ టార్గెట్‌ను 93 పరుగులగా నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని బ్రూక్ సేన 8.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు టీ20ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.


