‘హెన్రీ గొప్పగా ఏం ఆడలేదు.. ఇలా అయితే వరల్డ్‌కప్‌లో మాకు కష్టమే’ | Henry bowled good areas but Its Concern: Gambhir On India Batting Collapse | Sakshi
Sakshi News home page

‘హెన్రీ గొప్పగా ఏం ఆడలేదు.. ఇలా అయితే వరల్డ్‌కప్‌లో మాకు కష్టమే’

Nov 13 2026 4:42 PM | Updated on Nov 13 2026 4:46 PM

Henry bowled good areas but Its Concern: Gambhir On India Batting Collapse

గౌతం గంభీర్‌ (PC: Sonysports X)

న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో ఘోర పరాజయంపై టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ స్పందించాడు. వన్డే ప్రపంచకప్‌-2027 టోర్నీకి ముందు ఇలాంటి పరాభవం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నాడు. తమ బ్యాటర్లు మరింత మెరుగ్గా రాణించాల్సి ఉందని.. పేలవ ఆట తీరుతో వికెట్లు పారేసుకున్నారని విమర్శించాడు.

244 పరుగుల తేడాతో ఓటమి
కాగా ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లలో భారత్‌ కివీస్‌పై గెలుపొందింది. మూడో వన్డే వాన  వల్ల రద్దు కాగా.. శుక్రవారం నాటి నాలుగో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్‌ చేతిలో ఏకంగా 244 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మౌంట్‌ మౌంగనూయ్‌లో కివీస్‌ పేసర్‌ మ్యాట్‌ హెన్రీ ఆరు వికెట్ల తేడాతో చెలరేగి భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు.

89 పరుగులకే
ఈ క్రమంలో 334 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ కేవలం 89 పరుగులకే కుప్పకూలింది. అంతకు ముందు తొలి వన్డేలో కివీస్‌ను 185 పరుగుల కట్టడి చేసిన టీమిండియా.. వాన కారణంగా డీఎల్‌ఎస్‌ పద్ధతి ప్రకారం ఐదు వికెట్ల తేడాతో గెలిచింది.

ఇక రెండో వన్డేలో 134 పరుగులకే కివీస్‌ను ఆలౌట్‌ చేసిన భారత్‌.. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 113 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. అయితే, వర్షం అంతరాయం కలిగించడం వల్ల డీఎల్‌ఎస్‌ పద్ధతిలో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది.

మరీ అంత గొప్పగా ఏం బౌలింగ్‌ చేయలేదు
ఈ పరిణామాల నేపథ్యంలో గంభీర్‌ భారత బ్యాటర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘అంతర్జాతీయ క్రికెట్‌లో ఎదుర్కోలేని డెలివరీలు అంటూ ఏమీ ఉండవు. మ్యాట్‌ హెన్రీ మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తోనే బౌలింగ్‌ చేశాడు. అయితే, మా వాళ్లు అతడిని విజయవంతంగా ఎదుర్కోవాల్సింది.

మా బ్యాటర్ల వైఫల్యం వల్లే ఇలా
90 పరుగులలోపే ఆలౌట్‌ కావడం నిజంగా విచారించదగ్గ, ఆందోళన కలిగించే విషయం. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్‌ వేదికైన సౌతాఫ్రికాలోనూ ఇలాంటి పిచ్‌ పరిస్థితులే ఉంటాయి. గత మ్యాచ్‌లోనూ మేము తక్కువ పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయాము.

మేము మానసికంగా, నైపుణ్యాల పరంగా మరింత రాటుదేలాలి. ఇలాంటి పిచ్‌లపై 35-40/0 స్కోరు అంటే ఒకే. మా బ్యాటర్లు పరిస్థితులకు అలవాటు పడి గొప్పగా రాణిస్తారని ఆశిస్తున్నా’’ అని గంభీర్‌ పేర్కొన్నాడు. 

కాగా కివీస్‌తో నాలుగో వన్డేలో దిగ్గజాలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలతో పాటు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ డకౌట్‌ అయ్యాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ ఐదు పరుగులకే నిష్క్రమించగా.. ఇషాన్‌ కిషన్‌ 27, అక్షర్‌ పటేల్‌ 21, నమన్‌ ధీర్‌ 21 పరుగులతో ఫర్వాలేదనిపించారు. 

ఇవీ చదవండి: అతడు వరల్డ్‌ బెస్ట్‌.. మా విజయానికి కారణం అదే: కివీస్‌ కెప్టెన్‌
IND vs NZ: ‘నీ చేతులతో నువ్వే అంతా నాశనం చేసుకున్నావు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement