సహచర ఆటగాళ్లతో కుల్దీప్ యాదవ్ (PC: BCCI X)
న్యూజిలాండ్ తాజా పర్యటనలో తొలిసారి తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు భారత బౌలర్ కుల్దీప్ యాదవ్. చివరగా సొంతగడ్డపై అక్టోబరులో వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్ ఆడిన ఈ చైనామన్ స్పిన్నర్.. తాజాగా శుక్రవారం కివీస్‌తో నాలుగో వన్డే సందర్భంగా బరిలోకి దిగాడు.
చెత్త బౌలింగ్
మౌంట్ మౌంగనూయ్ వేదికగా ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ చెత్త ప్రదర్శన కనబరిచాడు. కేవలం ఎనిమిది ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఏకంగా 73 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ క్రమంలో రాకరాక అవకాశం వస్తే ఏకంగా తొమ్మిదికి పైగా ఎకానమీ రేటుతో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నీ చేతులతో నువ్వే అంతా నాశనం చేసుకున్నావు
‘‘కుల్దీప్ యాదవ్ తన చేతులతో తానే తన వరల్డ్‌కప్ టికెట్‌ను చించేసుకున్నాడు. నీ చేతులతో నువ్వే అంతా నాశనం చేసుకున్నావు కుల్దీప్. ఇక టీమిండియా యాజమాన్యం అతడిని వదిలేస్తుంది. ప్రపంచకప్ సన్నాహకాల నుంచి అతడు తప్పుకొన్నట్లే. ఇలాంటి బౌలర్లకు అవకాశం ఇస్తే జట్టు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది.
వరల్డ్‌కప్ ప్రధాన వేదికైన సౌతాఫ్రికాలో కుల్దీప్‌ను ఆడిస్తే ఫలితం దారుణంగా ఉంటుంది. ఇప్పటికైనా ప్రత్యామ్నాయాన్ని వెదకాల్సి ఉంది’’ అని టీమిండియా అభిమానులు సోషల్ మీడియా వేదికగా కుల్దీప్ యాదవ్ ఆట తీరుపై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు.
విల్ యంగ్ విధ్వంసం
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. నాలుగో వన్డేలో కివీస్ ఓపెనర్లలో విల్ యంగ్ భారత బౌలింగ్‌ను చితక్కొట్టి శతక్కొట్టాడు. కేవలం 108 బంతుల్లోనే 125 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ టిమ్ సీఫర్ట్ 48 బంతుల్లోనే 58 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఏకంగా 333 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
అక్షర్ ఒక్కడే పొదుపుగా
భారత బౌలర్లలో ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, నమన్ ధీర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేశాడు. పది ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 39 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
ఇవీ చదవండి: వన్డే చరిత్రలోనే టీమిండియా అత్యంత చెత్త రికార్డు
IND vs NZ: భారీ స్కోరు.. చరిత్ర సృష్టించిన కివీస్ జట్టు


