అద్భుత క్యాచ్‌తో డేంజరస్‌ బ్యాటర్‌కు షాకిచ్చిన రోహిత్‌ | Rohit Sharma Stunning Catch-Shocks Finn Allen-Viral-4th-ODI | Sakshi
Sakshi News home page

అద్భుత క్యాచ్‌తో డేంజరస్‌ బ్యాటర్‌కు షాకిచ్చిన రోహిత్‌

Nov 13 2026 10:28 AM | Updated on Nov 13 2026 10:47 AM

Rohit Sharma Stunning Catch-Shocks Finn Allen-Viral-4th-ODI

Photo Credit: Twitter

న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. 39 ఏళ్ల వయసులో అద్భుత డైవ్‌తో క్యాచ్ అందుకొని వయసు ప్రామాణికం కాదని మరోసారి నిరూపించాడు. తద్వారా ఫిన్ అలెన్ లాంటి విధ్వంసకర బ్యాటర్ ఔట్ కావడంలో హిట్‌మ్యాచ్ కీలకపాత్ర పోషించాడు. 

అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఫిన్ అలెన్‌ ఆఫ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే షార్ట్ కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ ఒక్కసారిగా ముందుకు డైవ్ చేసి అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు. అప్పటికే ఫిన్ అలెన్ 30 బంతుల్లోనే 41 పరుగులు చేసి దూకుడు మీద ఉన్నాడు. అప్పటికే ఫిన్ అలెన్‌, విల్ యంగ్‌ల మధ్య 90 పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదైంది. 

మ్యాచ్ ప్రారంభంలో విల్ యంగ్ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్ జారవిడిచాడు. దీంతో తనకు వచ్చిన లైఫ్‌ను ఉపయోగించుకున్న విల్ యంగ్ ఏకంగా శతకంతో విజృంభించాడు. అయితే ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి అన్న చందంగా ఒక క్యాచ్ మిస్ చేసినప్పటికీ మరో క్యాచ్‌తో ఆ లెక్కను సరి చేశాడు. రోహిత్‌ అందుకున్న క్యాచ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీలైతే మీరు ఒక​ లుక్కేయండి.

ఇదీ చదవండి: కోహ్లి వద్దన్నా వినలేదు.. కంట్రోల్ తప్పిన భారత బౌలర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement