టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌ | New Zealand Vs India 4th ODI-Match-Updates-Highlights-Mount Maunganui | Sakshi
Sakshi News home page

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Nov 13 2026 7:06 AM | Updated on Nov 13 2026 7:17 AM

New Zealand Vs India 4th ODI-Match-Updates-Highlights-Mount Maunganui

మౌంట్‌ మాంగనూయ్‌లోని బే ఓవల్‌ వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య నాలుగో వన్డే ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన టీమిండియా బౌలింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, కుల్దీప్‌ యాదవ్‌లు తుదిజట్టులోకి వచ్చారు. మరోవైపు తాము ఆరు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ పేర్కొన్నాడు.

ఇక ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ 2-0తో ఆధిక్యంలో ఉంది. తొలి రెండు వన్డేలు భారత్‌ గెలవగా, మూడో వన్డే వర్షం కారణంగా రద్దయింది. నేటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను ఒడిసి పట్టాలని భారత్‌ భావిస్తుండగా, నాలుగో వన్డేలో గెలిచి ఆధిక్యాన్ని తగ్గించాలనే పట్టుదలతో కివీస్‌ ఉంది.

తుది జ‌ట్లు:
న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), విల్ యంగ్, నిక్ కెల్లీ, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), క్రిస్టియన్ క్లార్క్, కైల్ జేమీసన్, మాట్ హెన్రీ, మాథ్యూ ఫిషర్

టీమిండియా: రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, నమన్ ధీర్, అఖిబ్ నబీ, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్

ఇదీ చదవండి: శ్రేయస్‌ సారథ్యంలో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement