శ్రీకాంత్‌ సంచలనం | Kidambi Srikanth and Lakshya Sen have stormed into the quarter finals of the Japan Open | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్‌ సంచలనం

Nov 13 2026 4:12 AM | Updated on Nov 13 2026 4:12 AM

Kidambi Srikanth and Lakshya Sen have stormed into the quarter finals of the Japan Open

కుమామోటో: జపాన్‌ ఓపెన్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్‌ (భారత్‌) క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 31వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 21–15, 11–21, 21–18తో ప్రపంచ 8వ ర్యాంకర్‌ కొడాయ్‌ నరోకా (జపాన్‌)పై సంచలన విజయం సాధించాడు. 

లక్ష్య సేన్‌ 21–8, 21–14తో డాంగ్‌ టియాన్‌ యావో (చైనా)ను ఓడించాడు. మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో్ల పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్‌) ద్వయం 14–21, 14–21తో రిన్‌ ఐవనగ–కె నకనిషి (జపాన్‌) జంట చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అర్జున్‌–హరిహరన్‌ (భారత్‌) జోడీ 14–21, 14–21తో టకురో హోకి–యుగో కొబయాషి (జపాన్‌) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. నేడు జరిగే సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో కొకి వతనాబె (జపాన్‌)తో శ్రీకాంత్‌; యుషి తనక (జపాన్‌)తో లక్ష్య సేన్‌ తలపడతారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement