Photo Credit: Twitter
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు మౌంట్ మౌంగనుయ్ (Mount Maunganui) వేదికగా అక్కడి స్థానిక మావోరీ తెగ సభ్యులు ప్రత్యేక అతిథులుగా విచ్చేసి, సంప్రదాయ 'హకా' (Haka) నృత్య ప్రదర్శనతో ఘనస్వాగతం పలికారు. రేపు మౌంట్ మౌంగనూయ్‌లోని బే ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో నాలుగో వన్డే జరగనుంది.
ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు, భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. న్యూజిలాండ్ స్థానిక సంస్కృతికి అద్దం పట్టేలా మావోరీ కళాకారులు తమ సంప్రదాయ పాటలు, హకా నృత్యంతో భారత ఆటగాళ్లను ఆకట్టుకున్నారు. భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు సీనియర్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, స్టాండింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ ప్రదర్శనను ఎంతో ఆసక్తిగా తిలకించారు.

ఈ స్వాగతం తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని, కొత్త ఉత్సాహాన్ని నింపిందని జట్టు తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు అక్కడికి వచ్చిన అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు ఇస్తూ సందడి చేశారు.
ఇక ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి రెండు వన్డేలు టీమిండియా నెగ్గగా, మూడో వన్డే వర్షార్పణమయింది. దీంతో నాలుగో వన్డేలో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. మరోవైపు న్యూజిలాండ్ మాత్రం చివరి రెండు వన్డేల్లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది.
TEAM INDIA RECEIVES A "SPECIAL HAKA WELCOME" AT BAY OVAL MOUNT MAUNGANUI. ❤️🥹 (Ankan Kar). https://t.co/e7SPGBvSzR
— Tanuj (@ImTanujSingh) November 12, 2026
ఇదీ చదవండి:


