టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. విధ్వంసక ప్లేయర్ వచ్చేస్తున్నాడు | Rishabh Pant Gets BCCI Centre Of Excellence Clearance After Injury Recovery Set To Join Team India In New Zealand Ahead Of Test Series | Sakshi
Sakshi News home page

IND vs NZ: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. విధ్వంసక ప్లేయర్ వచ్చేస్తున్నాడు

Nov 12 2026 5:29 PM | Updated on Nov 12 2026 5:34 PM

Pant gets CoE clearance, will fly to New Zealand soon

న్యూజిలాండ్‌తో కీలక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌ అందింది. పక్కటెముకల గాయంతో సతమవుతున్న స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. నవంబర్ 10, 11 తేదీల్లో వైద్య బృందం నిర్వహించిన రెండు కఠినమైన ఫిట్‌నెస్, సిమ్యులేషన్ పరీక్షలను పంత్ విజయవంతంగా పూర్తి చేశాడు. దీంతో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి అతడికి ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభించింది. ఈ నేపథ్యంలో అతడు ఒకట్రెండు రోజుల్లో న్యూజిలాండ్‌కు పయనం కానున్నాడు.

కాగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో పంత్‌కు చోటు దక్కినప్పటికి.. తన ఫిట్‌నెస్‌ను మాత్రం నిరూపించుకోవాలని సెలక్టర్లు కండీషన్‌ పెట్టారు. అదేవిధంగా రెడ్-బాల్ ప్రాక్టీస్ కోసం ఇండియా-ఎ జట్టుకు కూడా అతడిని ఎంపిక చేశారు. కానీ కివీస్‌-ఎతో జరిగిన మూడు అనధికారిక టెస్టులకు పంత్ సమయానికి కోలుకోలేకపోయాడు.

అయితే ప్రధాన టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే పూర్తి ఫిట్‌నెస్ సాధించడం భారత బ్యాటింగ్ లైనప్‌కు పెద్ద బలంగా మారనుంది. కాగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు నవంబర్ 19న వెల్లింగ్టన్‌లో ప్రారంభం కానుండగా, రెండో టెస్టు నవంబర్ 27 నుంచి క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరగనుంది. డబ్ల్యూటీసీ 2027 ఫైనల్‌ రేసులో భారత్‌ ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిందే.
చదవండి: జట్టు ప్రకటన.. ఇషాన్‌ కిషన్‌కు నో ఛాన్స్‌! కెప్టెన్‌గా అతడే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement