IND vs NZ: నాలుగో వన్డేకు భారత తుదిజట్టు!.. ఓపెనర్లుగా వీరే! | IND vs NZ 4th ODI: Aakash Chopra playing XI Ishan to open with Rohit | Sakshi
Sakshi News home page

IND vs NZ: నాలుగో వన్డేకు భారత తుదిజట్టు ఇదే!.. ఓపెనర్లుగా వీరే

Nov 12 2026 11:16 AM | Updated on Nov 12 2026 11:21 AM

IND vs NZ 4th ODI: Aakash Chopra playing XI Ishan to open with Rohit

PC: BCCI X

న్యూజిలాండ్‌- టీమిండియా మధ్య నాలుగు వన్డేకు రంగం సిద్ధమైంది. మౌంట్‌ మౌంగనూయ్‌లో శుక్రవారం జరిగే ఈ మ్యాచ్‌కు బే ఓవల్‌ మైదానం వేదిక. కాగా ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత జట్టు ఇప్పటికే రెండు విజయాలతో 2-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

శ్రేయస్‌ అ‍య్యర్‌ సారథ్యంలో
ఇరుజట్ల మధ్య మూడో వన్డే వర్షం వల్ల రద్దైపోయింది. ఇదిలా ఉంటే.. తొలి మూడో వన్డేలకు రెగ్యులర్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ టీమిండియాను ముందుకు నడిపించగా.. చివరి రెండు వన్డేల్లో శ్రేయస్‌ అ‍య్యర్‌ సారథిగా వ్యవహరిస్తాడు. ఇక కేఎల్‌ రాహుల్‌ టెస్టు సన్నాహకాల్లో భాగంగా వన్డే జట్టుకు దూరమయ్యాడు. వీటితో పాటు వన్డే జట్టులో పలుమార్పులు కూడా ఉన్నాయి.

ఓపెనర్లుగా వీరే
ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో నాలుగు వన్డేకు టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘ఇషాన్‌ కిషన్‌ను ఓపెనర్‌గా పంపాలా? లేదంటే మిడిలార్డర్‌లో ఆడించాలా? టీమిండియా సెలక్టర్ల ముందున్న కఠిన ప్రశ్న ఇదే.

నేనైతే రోహిత్‌ శర్మతో కలిసి ఇషాన్‌ను ఓపెనర్‌గానే ఆడిస్తా. అప్పుడు లెఫ్ట్‌-రైట్‌ కాంబినేషన్‌ కుదురుతుంది. ఇదే జరిగితే రుతురాజ్‌ గైక్వాడ్‌ను నాలుగు లేదంటే ఐదో స్థానంలో పంపవచ్చు. గతంలో రుతును నాలుగో స్థానంలో ఆడించారు.

నబీని రెండు మ్యాచ్‌లలో ఆడిస్తా
అప్పుడు అతడు శతక్కొట్టాడు కూడా!.. కానీ ఆ తర్వాత రుతుకు పెద్దగా అవకాశాలే రావడం లేదు. అయితే, ఈసారి మాత్రం కచ్చితంగా అతడిని ఆడించే ఆస్కారం ఉంది. నిజానికి అతడు ఓపెనింగ్‌ బ్యాటర్‌. కానీ మిడిలార్డర్‌లో ఆడే అవకాశమే ఎక్కువగా ఉంది.

నా తుదిజట్టులో రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ ఓపెనర్లు. ఆ తర్వాతి స్థానాల్లో విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, నమన్‌ ధీర్‌, అక్షర్‌ పటేల్‌, ఆకిబ్‌ నబీ, గుర్నూర్‌ బ్రార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ ఆడతారు. కుల్దీప్‌ యాదవ్‌ లేదంటే మహ్మద్‌ సిరాజ్‌లలో ఒకరికి చోటు దక్కుతుంది. నేనైతే నబీని మిగిలిన రెండు వన్డేల్లోనూ ఆడిస్తాను’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు.

న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేకు ఆకాశ్‌ చోప్రా ఎంచుకున్న భారత తుదిజట్టు
రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, నమన్‌ ధీర్‌, అక్షర్‌ పటేల్‌, ఆకిబ్‌ నబీ, గుర్నూర్‌ బ్రార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌/మహ్మద్‌ సిరాజ్‌.

ఇదీ చదవండి: భారత్‌తో చివరి రెండు వన్డేలు.. న్యూజిలాండ్‌ జట్ల ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement