ఇంగ్లండ్‌ సిరీస్‌కు భారత్‌ జట్ల ప్రకటన | India A Womens squads announced for England A series | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ సిరీస్‌కు భారత్‌ జట్ల ప్రకటన

Nov 12 2026 9:09 AM | Updated on Nov 12 2026 9:09 AM

India A Womens squads announced for England A series

source: X

స్వదేశంలో ఇంగ్లండ్‌ మహిళల ఏ జట్టుతో జరుగబోయే మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం వేర్వేరు భారత మహిళల ఏ జట్లను ప్రకటించారు. టీ20, వన్డే జట్లకు అనుష్క శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. మల్టీ డే మ్యాచ్‌కు మిన్నూ మణి నాయకత్వం వహించనుంది.

ఈ జట్లలో టీమిండియా ఆల్‌రౌండర్‌ శ్రేయాంక పాటిల్‌కు అవకాశం దక్కింది.మూడు ఫార్మాట్ల జట్లలో చోటు దక్కించుకున్న ఐదుగురు ఆటగాళ్లలో శ్రేయాంక ఒకరు. మిన్ను మణి, షిప్రా గిరి, తనిషా సింగ్, సైమా ఠాకూర్ కూడా టీ20, వన్డే, మల్టీ డే జట్లలో స్థానం సంపాదించారు.

వైస్‌ కెప్టెన్లు వీరే..!
ఇంగ్లండ్-ఏతో జరిగే మూడు టీ20లు, మూడు వన్డేల్లో ఇండియా-ఏ జట్టుకు అనుష్క శర్మ నాయకత్వం వహించనుంది. మిన్ను మణి వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. ఇక మల్టీడే మ్యాచ్‌లో మిన్ను మణి కెప్టెన్‌గా, తేజల్ హసబ్నిస్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

టీ20లకు ఇండియా-ఏ జట్టు:
అనుష్క శర్మ (కెప్టెన్), మిన్ను మణి (వైస్ కెప్టెన్), వృందా దినేశ్, తనిషా సింగ్, సనికా చాల్కే, నికీ ప్రసాద్, జి. కమలిని, షిప్రా గిరి, అమన్‌జోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, వైష్ణవి శర్మ, ప్రేమ రావత్, సైమా ఠాకూర్, మోనికా పటేల్, కాశ్వీ గౌతమ్.

వన్డేలకు ఇండియా-ఏ జట్టు:
అనుష్క శర్మ (కెప్టెన్), మిన్ను మణి (వైస్ కెప్టెన్), వృందా దినేశ్, తనిషా సింగ్, ప్రియా పునియా, నికీ ప్రసాద్, జి. కమలిని, షిప్రా గిరి, తేజల్ హసబ్నిస్, శ్రేయాంక పాటిల్, అమిషా బహుకండి, షబ్నమ్ షకీల్, సైమా ఠాకూర్, అక్షితా భగత్, కాశ్వీ గౌతమ్.

మల్టీ డే మ్యాచ్‌కు ఇండియా-ఏ జట్టు:
మిన్ను మణి (కెప్టెన్), తేజల్ హసబ్నిస్ (వైస్ కెప్టెన్), శుభ సతీష్, ప్రియా పునియా, తనిషా సింగ్, పూర్వజా వెర్లేకర్, హెన్రియెట్టా పెరేరా, షిప్రా గిరి, ఉమా ఛేత్రి, శ్రేయాంక పాటిల్, సైమా ఠాకూర్, అక్షితా భగత్, అమిషా బహుకండి, హ్యాపీ కుమారి, షబ్నమ్ షకీల్.

ఇంగ్లండ్-ఏ సిరీస్ పూర్తి షెడ్యూల్
- టీ20 మ్యాచ్‌లు: నవంబర్ 30, డిసెంబర్ 3, డిసెంబర్ 5. వేదిక: పూణే
- వన్డే మ్యాచ్‌లు: డిసెంబర్ 8, 11, 14. వేదిక: ముంబైలోని వాంఖడే స్టేడియం
- మల్టీ డే మ్యాచ్: డిసెంబర్ 19 నుంచి. వేదిక: వాంఖడే స్టేడియం

ఇదీ చదవండి: మరోసారి ఐపీఎల్‌ వేలంలో ముస్తాఫిజుర్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement