నవంబర్‌ 22న పాక్‌ ‘ఎ’తో భారత్‌ ‘ఎ’ పోరు | Asia Cup Rising Stars Cricket Tournament to be held next month | Sakshi
Sakshi News home page

నవంబర్‌ 22న పాక్‌ ‘ఎ’తో భారత్‌ ‘ఎ’ పోరు

Oct 26 2026 4:16 AM | Updated on Oct 26 2026 4:16 AM

Asia Cup Rising Stars Cricket Tournament to be held next month

వచ్చే నెలలో ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ క్రికెట్‌ టోర్నీ  

దుబాయ్‌: రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌లో భాగంగా వచ్చే నెల 22న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత ‘ఎ’ జట్టు మ్యాచ్‌ ఆడనుంది. నవంబర్‌ 19 నుంచి దోహా వేదికగా జరగనున్న ఈ వన్డే టోర్నమెంట్‌లో ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ తమ ‘ఎ’ జట్లను ఈ టోర్నీ బరిలోకి దించుతుండగా... నేపాల్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌ (యూఏఈ), హాంకాంగ్‌ ప్రధాన జట్లు పోటీపడనున్నాయి.

ఇప్పటి వరకు ఏడుసార్లు నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో భారత్‌ ఒక్కసారి (2013లో) విజేతగా నిలిచింది.  పాకిస్తాన్‌ ‘ఎ’, నేపాల్, యూఏఈతో కలిసి భారత్‌ గ్రూప్‌ ‘బి’ నుంచి పోటీపడుతుండగా... శ్రీలంక ‘ఎ’, బంగ్లాదేశ్‌ ‘ఎ’, అఫ్గానిస్తాన్‌ ‘ఎ’, హాంకాంగ్‌ జట్లు గ్రూప్‌ ‘ఎ’లో ఉన్నాయి. టోర్నమెంట్‌లో భాగంగా నవంబర్‌ 20న తొలి మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడనున్న భారత్‌ ఆ తర్వాత పాకిస్తాన్‌ (నవంబర్‌ 22), యూఏఈ (నవంబర్‌ 24)తో మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్‌ దశలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన రెండేసి జట్లు సెమీఫైనల్‌కు చేరనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement