breaking news
Rising Stars
-
భారత్ ‘ఎ X పాక్ ‘ఎ’
దోహా: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మరోసారి పోరుకు రంగం సిద్ధమైంది. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో భాగంగా నేడు భారత్ ‘ఎ’, పాకిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్స్‌లతో 144 పరుగులు చేసిన భారత టీనేజ్ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టి ఉంది. సెప్టెంబర్ లో యూఏఈలో జరిగిన ఆసియా కప్ టి20 టోర్నీలో పాకిస్తాన్, భారత ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకోలేదు. మరి ఈ మ్యాచ్‌లో జితేశ్ శర్మ నాయకత్వంలోని భారత ‘ఎ’ జట్టు సభ్యులు కూడా పాకిస్తాన్ ‘ఎ’ ఆటగాళ్లతో కరచాలనం చేసే అవకాశం కనిపించడంలేదు. -
‘రైజింగ్ స్టార్స్’ నాగరాజు, రాకేశ్
రాహుల్, రేహన్‌లు కూడా సాక్షి, హైదరాబాద్: ఎయిర్టెల్ సంస్థ నిర్వహించిన ‘సాకర్ రైజింగ్ స్టార్స్’ శిబిరంలో నగరానికి చెందిన నలుగురు కుర్రాళ్లు మెరిశారు. నాగరాజు, రాకేశ్, రాహుల్, రేహన్‌లు హైదరాబాద్ నుంచి ఫైనల్ సెలక్షన్ ట్రయల్స్‌కు ఎంపికయ్యారు. ఈ తుది ఎంపిక ప్రక్రియ ఈ నెల 20 నుంచి గోవాలో రెండు రోజుల పాటు జరుగనుంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో అండర్-16 విభాగంలో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరాల నుంచి మొత్తం 23 మంది ప్రతిభావంతులను ఎంపిక చేశారు. ఈ జాబితా నుంచి తుది 11 మంది కుర్రాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేస్తారు. తుది జట్టులో ఒక గోల్‌కీపర్ ఉంటాడు. ఈ జట్టును గోవాలోనే ఈ నెల 21న ప్రకటిస్తారు. వీరికి ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ అయిన మాంచెస్టర్ యునెటైడ్ కోచ్‌లు ఆటలో మెళకువలు నేర్పిస్తారు. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ యునెటైడ్ సాకర్ స్కూల్లో వారం పాటు ఈ శిబిరం జరుగుతుంది. హైదరాబాద్‌తో పాటు కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, గువాహటి, గోవా నగరాల్లో ఎయిర్టెల్ రైజింగ్ స్టార్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు.


