బంగ్లాదేశ్ ‘ఎ’తో సెమీఫైనల్ నేడు
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్
మధ్యాహ్నం 3 గంటల నుంచి నుంచి ‘సోనీ’ నెట్‌వర్క్‌లో ప్రసారం
దోహా: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ క్రికెట్ టి20 టోర్నీలో జోరు మీదున్న భారత ‘ఎ’ జట్టు ఫైనలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. నేడు బంగ్లాదేశ్ ‘ఎ’తో జరిగే సెమీఫైనల్‌లో టాప్ ఫామ్‌లో ఉన్న ఓపెనింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి బ్యాటర్ల సహకారం లభిస్తే చాలు భారత్ విజయానికి ఢోకా ఉండదు.
ఈ టోర్నీలో వైభవ్ 201 పరుగులతో అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. కానీ మిగతా బ్యాటర్లలో కెపె్టన్ జితేశ్ శర్మ సహా నమన్ ధీర్, ప్రియాన్‡్ష ఆర్య, నేహల్ వధేరాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఇప్పటివరకు ఏ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయారు.
కీలకమైన సెమీస్‌లో వీరంతా బాధ్యత కనబరిస్తేనే బంగ్లాపై విజయం సాధించవచ్చు. లేదంటే ఊహించని ఫలితం ఎదురైనా ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ టోర్నీలో భారత్‌లాగే బంగ్లాదేశ్ కూడా దీటుగా రాణించింది. అఫ్గానిస్తాన్ ‘ఎ’, శ్రీలంక ‘ఎ’ జట్లను కంగుతినిపించిన బంగ్లా... భారత్‌తో క్లిష్టమైన పోరుకు సై అంటోంది. పేసర్ రిపొన్ మోండల్, లెఫ్టార్మ్ స్పిన్నర్ రకీబుల్ హసన్‌ల నుంచి భారత బ్యాటర్లకు సవాళ్లు ఎదురవొచ్చు.
భారత బౌలర్లలో గుర్జప్‌నీత్, స్పిన్నర్ హర్‡్ష దూబేలు నిలకడగా ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. కీలకమైన సెమీస్‌లోనూ వీరి జోరు కొనసాగాలని జట్టు ఆశిస్తోంది. శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్ ‘ఎ’తో శ్రీలంక ‘ఎ’ తలపడుతుంది. ఈ రెండు సెమీఫైనల్స్‌లో చిరకాల ప్రత్యర్థులు గెలిస్తే... ఆదివారం జరిగే ఫైనల్ సమరం దాయాదుల మధ్యే జరిగే అవకాశముంది.
భారత్ ‘ఎ’ జట్టు: జితేశ్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ నేహల్, నమన్ ధీర్, సూర్యాన్ష్ రమణ్‌దీప్, హర్ష్ దూబే, అశుతోష్, యశ్ ఠాకూర్, గుర్జప్‌నీత్, వైశాక్.
బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టు: అక్బర్ అలీ (కెప్టెన్), హబీబుర్, యాసిర్ అలీ, జీషాన్, అరిఫుల్ ఇస్లామ్, రకీబుల్, మహిదుల్, అహ్మద్ రేహాన్, రిపొన్ మోండల్, అబు హిదార్, గఫార్, అబ్రార్.


