నేడు రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టి20 టోర్నీలో ‘ఢీ’
రాత్రి 8 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం
దోహా: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మరోసారి పోరుకు రంగం సిద్ధమైంది. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో భాగంగా నేడు భారత్ ‘ఎ’, పాకిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్స్‌లతో 144 పరుగులు చేసిన భారత టీనేజ్ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టి ఉంది.
సెప్టెంబర్ లో యూఏఈలో జరిగిన ఆసియా కప్ టి20 టోర్నీలో పాకిస్తాన్, భారత ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకోలేదు. మరి ఈ మ్యాచ్‌లో జితేశ్ శర్మ నాయకత్వంలోని భారత ‘ఎ’ జట్టు సభ్యులు కూడా పాకిస్తాన్ ‘ఎ’ ఆటగాళ్లతో కరచాలనం చేసే అవకాశం కనిపించడంలేదు.


