సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఎండీసీ టీపీజీఎల్–2026 మైసా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ రెడ్డి కంకణాల అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్‌లో జరిగిన పోటీల్లో 11వ హోల్‌పై ఒకే షాట్‌తో బంతిని హోల్‌లోకి పంపి హోల్ ఇన్ వన్ సాధించాడు. ఈ అద్భుత ఘనత టోర్నీలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్వార్టర్స్‌లో హోరాహోరీ పోటీలతో పాటు అభిషేక్ సాధించిన హోల్ ఇన్ వన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మైసా జట్టు క్వార్టర్ ఫైనల్స్‌లో ఓటమి పాలైనప్పటికీ... అభిషేక్ రెడ్డి వ్యక్తిగతంగా సాధించిన ఈ ఘనత టోర్నీలో హైలెట్ గా నిలిచింది. క్వార్టర్ ఫైనల్స్‌లో జైరాజ్ స్టీలర్స్ జట్టు 4–2తో జీఎంఆర్ ఎలిగాన్స్‌పై... ఎజైల్ వ్యాలీ వారియర్స్ 3.5–2.5తో హల్దీ ఫెయిర్‌వేస్‌పై గెలిచాయి. లండన్ రాయల్స్ 5–1తో జీఎన్‌ఐటీఎస్ లహరి లయన్స్‌ను ఓడించగా, ఐరోకో లార్వెన్ అవెంజర్స్ 4–2తో మైసా జట్టుపై విజయం సాధించి సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి.


