ఫైనల్లో అంబేకర్‌ | Ambekar has stormed into the semi finals of the mens 50kg boxing event at the Youth Olympics | Sakshi
Sakshi News home page

ఫైనల్లో అంబేకర్‌

Nov 12 2026 4:06 AM | Updated on Nov 12 2026 4:06 AM

Ambekar has stormed into the semi finals of the mens 50kg boxing event at the Youth Olympics

డకర్‌ (సెనెగల్‌): యూత్‌ ఒలింపిక్స్‌ పురుషుల బాక్సింగ్‌ 50 కేజీల విభాగంలో అంబేకర్‌ మీటీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన సెమీఫైనల్లో అంబేకర్‌ మీటీ 5–0 పాయింట్ల తేడాతో ఇజాన్‌ జెఫ్రీ అరెవాలో (కొలంబియా)పై విజయం సాధించాడు. భారత్‌ నుంచి చివరిసారిగా 2010లో శివ థాపా యూత్‌ ఒలింపిక్స్‌ ఫైనల్‌కు చేరగా... ఇప్పుడు 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అంబేకర్‌ పసిడి పోరుకు అర్హత సాధించాడు. ఈ టోర్నీలో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. మహిళల బాక్సింగ్‌ 48 కేజీల విభాగంలో గుంజన్‌ సెమీస్‌కు చేరడం ద్వారా కనీసం కాంస్య పతకం ఖరారు చేసుకుంది. క్వార్టర్స్‌లో గుంజన్‌ 5–0 పాయింట్ల తేడాతో అటెనా సోఫీ జురేజ్‌ (మెక్సికో)పై గెలిచింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement