కావ్య, అనిరుధ్‌ల రిసెప్ష‌న్‌కు ఇషాన్, అభిషేక్‌! | Abhishek Sharma-Ishan Kishan-Expected To Attend-Kavya-Anirudh Reception | Sakshi
Sakshi News home page

కావ్య, అనిరుధ్‌ల రిసెప్ష‌న్‌కు ఇషాన్, అభిషేక్‌!

Nov 11 2026 9:07 PM | Updated on Nov 11 2026 9:15 PM

Abhishek Sharma-Ishan Kishan-Expected To Attend-Kavya-Anirudh Reception

Photo Credit: Twitter

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ య‌జమాని కావ్యా మార‌న్ వివాహం గ్రీస్ వేదిక‌గా బుధ‌వారం ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద‌ర్‌తో జ‌రిగింది. గ్రీస్‌లో బంధువులు, సెలెబ్రిటీల స‌మ‌క్షంలో వీరిద్ద‌రు డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకున్నారు. వివాహ‌బంధంతో ఒక్కటైన ఈ జంట‌కు సంబంధించిన ఫొటోను అనిరుధ్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. 

'నా జీవితంలో ఒక్కసారి మాత్ర‌మే వ‌చ్చే అవ‌కాశం, జీవితాంతం నిలిచిపోయేది. 11.11 ఫ‌ర్ ఎవ‌ర్‌' అని పోస్టు చేశాడు. కాగా కావ్యా మార‌న్‌, అనిరుధ్ ర‌విచందర్‌ల రిసెప్ష‌న్ న‌వంబ‌ర్ 21న చెన్నైలో ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. కావ్యా మార‌న్ ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ ఫ్రాంచైజీకి యాజ‌మానిగా ఉండ‌డంతో ఆమెకు క్రికెట‌ర్ల‌తో స‌త్ససంబంధాలున్నాయి. 

దీంతో వీరిద్ద‌రి రిసెప్ష‌న్ వేడుక‌కు ఎస్ఆర్‌హెచ్‌ క్రికెట‌ర్లు కూడా త‌ర‌లిరానున్నారు. ముఖ్యంగా ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టులో కీల‌క ఆట‌గాళ్లుగా ఉన్న ఇషాన్‌ కిష‌న్‌, అభిషేక్ శ‌ర్మ రిసెప్ష‌న్‌కు హాజ‌ర‌య్యే అవ‌కాశ‌ముంది. ఇప్ప‌టికే అభిషేక్ శ‌ర్మ ఇండియాకు తిరిగి రాగా, న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్ ముగిసిన త‌ర్వాత ఇషాన్ కూడా భార‌త్‌కు రానున్నాడు. వీరితో పాటు స‌చిన్ టెండూల్క‌ర్‌, ఎంఎస్ ధోని కూడా హాజ‌ర‌య్యే అవ‌కాశాలున్నాయి.

ఇదీ చదవండి: వివాహబంధంలోకి అనిరుధ్ రవిచందర్, కావ్యా మారన్

కివీస్ గ‌డ్డ‌పై గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో అర్ష‌దీప్ నిశ్చితార్థం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement