ఒక్క సెంచ‌రీతో డ‌బుల్ రికార్డులు కొల్ల‌గొట్టిన లంక బ్యాట‌ర్‌ | Dhananjaya de Silva-Two-Elite Records-Test Century-Joins-Sanath-Jayasuriya | Sakshi
Sakshi News home page

ఒక్క సెంచ‌రీతో డ‌బుల్ రికార్డులు కొల్ల‌గొట్టిన లంక బ్యాట‌ర్‌

Nov 11 2026 4:05 PM | Updated on Nov 11 2026 4:11 PM

Dhananjaya de Silva-Two-Elite Records-Test Century-Joins-Sanath-Jayasuriya

Photo Credit: Twitter

పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక బ్యాట‌ర్ ధ‌నంజ‌య డిసిల్వా కెరీర్‌లో 14వ సెంచ‌రీతో మెరిశాడు. ఇన్నింగ్స్ 70వ ఓవ‌ర్లో అరాఫ‌త్‌ మిన్హాస్ బౌలింగ్‌లో ధ‌నంజ‌య ఈ ఫీట్‌ను అందుకున్నాడు.151 బంతుల్లో సెంచ‌రీ మార్క్ అందుకున్న ధ‌నంజ‌య ఖాతాలో 12 బౌండ‌రీలున్నాయి.  

ఈ క్ర‌మంలో ధ‌నంజ‌య డిసిల్వా లంక దిగ్గ‌జ బ్యాట‌ర్ స‌న‌త్ జ‌య‌సూర్య రికార్డును సమం చేశాడు. లంక త‌ర‌ఫున టెస్టుల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన బ్యాట‌ర్ల జాబితాలో జ‌య‌సూర్య‌, థిల్లాన్ స‌మ‌ర‌వీరతో క‌లిసి ధ‌నంజ‌య సంయుక్తంగా తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఓవ‌రాల్ జాబితాలో లంక త‌ర‌ఫున కుమార సంగ‌క్క‌ర (134  మ్యాచ్‌ల్లో 38 సెంచ‌రీలు) తొలి స్థానంలో కొన‌సాగుతున్నాడు.

అంతేకాదు, పాకిస్తాన్‌పై త‌న‌కున్న ఘ‌న‌మైన రికార్డును ధ‌నంజ‌య విజ‌య‌వంతంగా కొన‌సాగిస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు పాక్‌పై 12 ఇన్నింగ్స్‌ల్లో ఇది నాలుగో సెంచ‌రీ. ఈ విష‌యంలో ధ‌నంజ‌య జ‌య‌సూర్య‌ను అధిగ‌మించాడు. జ‌య‌సూర్య పాకిస్తాన్‌పై నాలుగు సెంచ‌రీలు చేసిన‌ప్ప‌టికీ, అవి 30 ఇన్నింగ్స్‌ల్లో వ‌చ్చాయి. పాక్‌పై అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన‌ జాబితాలో సంగ‌క్క‌ర (10), అరంవిద డిసిల్వాలు (8) వ‌రుస‌గా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

మ్యాచ్ విష‌యానికొస్తే, 92 ఓవ‌ర్లు ముగిసేస‌రికి శ్రీలంక 4 వికెట్ల న‌ష్టానికి 366 ప‌రుగులు చేసింది. కుశాల్ మెండిస్ (101), ధ‌నంజ‌య డిసిల్వా (147) క్రీజులో ఉన్నారు. అంత‌క‌ముందు క‌మిందు మెండిస్ (58) అర్థ‌సెంచ‌రీ సాధించాడు. పాక్ బౌల‌ర్ల‌లో మొహ‌మ్మ‌ద్ అబ్బాస్, స‌కిబ్ ఖాన్‌లు చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు.

ఇదీ చదవండి: సెంచరీతో కదంతొక్కిన ధనంజయ.. పాక్‌కు ధీటుగా బదులిస్తున్న శ్రీలంక

రాజస్థాన్‌-లక్నో మధ్య ఆసక్తికర ట్రేడ్‌ డీల్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement