source: X
రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక మిడిలార్డర్ బ్యాటర్ ధనంజయ డిసిల్వ సెంచరీతో కదంతొక్కాడు. 151 బంతుల్లో మూడంకెల మార్కును అందుకున్నాడు. అతడికి టెస్ట్‌ల్లో ఇది 14వ శతకం. ప్రత్యేకించి రావల్పిండి మైదానంలో రెండవది.
ఈ మ్యాచ్‌లో ధనంజయ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి కమిందు మెండిస్ (58), కుసాల్ మెండిస్ సహకారంతో ఇన్నింగ్స్‌ను తీర్చిదిద్దుతున్నాడు. మూడో రోజు రెండో సెషన్ సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్ 311-4గా ఉంది. ధనంజయ 120, కుసాల్ మెండిస్ 75 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
మిగతా బ్యాటర్లలో లహీరు ఉదార 42, కమిందు మెండిస్ 58 పరుగులు చేయగా..చండీమల్ 1, సూరియబండార డకౌటయ్యారు. పాక్ బౌలర్లలో అబ్బాస్, సాకిబ్ ఖాన్ తలో వికెట్లు పడగొట్టారు. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు శ్రీలంక ఇంకా 123 పరుగులు వెనుకపడి ఉంది. లంక బ్యాటర్లు పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ధీటుగా జవాబిస్తున్నారు.
అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌ను 434-9 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. తయ్యబ్ ఆరిఫ్ (57), మొహమ్మద్ తాహా (51), కెప్టెన్ బాబర్ ఆజం (50), అరాఫత్ మిన్హాస్ (52) అర్ద సెంచరీలతో రాణించారు. సౌద్ షకీల్ (93) ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
వికెట్ కీపర్ ఘాజీ ఘోరీ (48) అర్ద సెంచరీ మిస్ కాగా.. అజాన్ అవైస్ 30, సల్మాన్ అఘా 16, రజావుల్లా 10 పరుగులకు ఔటయ్యారు. లంక బౌలర్లలో దిల్షన్ మధుషంక, అసిత ఫెర్నాండో చెరో 3 వికెట్లు పడగొట్టగా.. లహీరు కుమార, మిలన్ రత్నాయకే, సోనల్ దినుష తలో వికెట్ దక్కించుకున్నారు.
కాగా, శ్రీలంక జట్టు టీ20, టెస్ట్ సిరీస్‌ల కోసం పాక్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో తొలుత జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
ఇదీ చదవండి: రాజస్థాన్-లక్నో మధ్య ఆసక్తికర ట్రేడ్ డీల్..!


