చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) యజమాని కావ్యా మారన్ వివాహబంధంలోకి అడుగుపెట్టినట్లు సమాచారం. గ్రీస్‌లో అత్యంత వైభవంగా వీరి వివాహ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లి అనంతరం కావ్యా మారన్‌తో కలిసి ఉన్న ఫొటోను అనిరుధ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
My once in a lifetime, for a lifetime ❤️ 11.11 https://t.co/pSdCxqRN2I
— Anirudh Ravichander (@anirudhofficial) November 11, 2026
ఈ వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించినట్లు వార్తలు వస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ సైతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం. కాగా నవంబర్ 21న చెన్నైలో వీరి వివాహ రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదీ చదవండి: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు


