అనిరుధ్ పెళ్లి.. విదేశానికి రజనీకాంత్, స్టాలిన్ ఫ్యామిలీస్ | Rajinikanth And Mk Stalin Family Flys Greece For Anirudh Marriage | Sakshi
Sakshi News home page

Anirudh Marriage: డెస్టినేషన్ వెడ్డింగ్.. వీడియోలు వైరల్

Nov 9 2026 1:33 PM | Updated on Nov 9 2026 1:34 PM

Rajinikanth And Mk Stalin Family Flys Greece For Anirudh Marriage

అనిరుధ్ పెళ్లి సందడి మొదలైపోయింది. గ్రీస్ దేశంలో డెస్టినేషన్ తరహా ఈ వివాహం జరగనుంది. ఇందులో భాగంగానే పెళ్లికొడుకు, పెళ్లికూతురు బంధువులైన సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబాలు.. గ్రీస్ దేశానికి పయనమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: నిశ్చితార్థం జరిగిన రెండేళ్లకు పెళ్లి చేసుకున్న హీరోయిన్)

సంగీత దర్శకుడు అనిరుధ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. గత మూడేళ్లుగా వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ కళానిధి మారన్ కూతురే కావ్య. రీసెంట్‌గా వచ్చిన 'జైలర్ 2'తో అటు మారన్, ఇటు అనిరుధ్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు ఈ పెళ్లితో మామ అల్లుడు కాబోతున్నారు.

నవంబర్ 21న చెన్నైలో ఈ పెళ్లి రిసెప్షన్ జరగనుంది. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు చాలామంది సినీ రాజకీయ ప్రముఖులకు అందజేశారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement