రీసెంట్ టైంలో సెన్సార్ బోర్డ్ వల్ల చాలా సినిమాలు సమస్యల్లో ఇరుక్కుంటున్నాయి. అన్నీ సిద్ధం చేసుకుని వెళ్లినా.. కంటెంట్లో చేర్పులు మార్పుల చేయమని చెబుతుండటంతో చెప్పిన టైంకి థియేటర్లకు రాలేకపోతున్నాయి. ఈ లిస్టులోకి ఇప్పుడు మరో మూవీ చేరింది. అదే శర్వానంద్ 'భోగి'.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ విలేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ని 'రంగస్థలం' టైపు కథతో తీసినట్లు తెలుస్తోంది. శర్వానంద్ సరసన అనుపమ నటించగా, డింపుల్ హయాతి కీలక పాత్ర చేసింది. లెక్క ప్రకారం ఈ గురువారం(నవంబర్ 12) రిలీజ్ చేయాలనుకుని అందుకు తగ్గట్లు ప్రమోషన్లు చేస్తున్నారు.
ఇప్పుడు ఉన్నట్లుండి సినిమాని సెన్సార్ బోర్డ్.. రివైజింగ్ కమిటీకి పంపించింది. ఈ క్రమంలోనే వాయిదా పడింది. ఈ విషయం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. బహుశా ఈ నెల చివరికల్లా థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'రణబాలి'.. ప్రకటన వచ్చేసింది)


