రజనీ, అజిత్‌, ధనుష్‌.. శ్రీలీల ప్లాన్‌ అదుర్స్‌! | Sreeleela Upcoming Films Full Details | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌లో దూసుకెళ్తున్న శ్రీలీల.. మూడు బడా సినిమాలతో బిజీ బిజీ!

Nov 7 2026 7:08 AM | Updated on Nov 7 2026 7:16 AM

Sreeleela Upcoming Films Full Details

ఏ నటి ఎప్పుడు ఏ భాషలో అందలం ఎక్కుతుందో ఎవరూ ఊహించలేదు. ఈ విషయాన్ని బహుశా ఆ నటీమణులు కూడా ఊహించలేరు. అలాంటి నటీమణుల్లో శ్రీలీల ఒకరిని కచ్చితంగా చెప్పవచ్చు. తెలుగు, కన్నడం, హిందీ, తమిళం అంటూ పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న క్రేజీ కథానాయకి ఈ బ్యూటీ. ఆదిలో తెలుగులో రెండు చిత్రాల్లో నటించి సక్సెస్‌ను అందుకున్నా.. ఆ తర్వాత అవకాశాలు రావడానికి కొంచెం సమయం పట్టింది. ఆ తర్వాత వచ్చిన ధమాకా తెలుగు చిత్రం క్రేజ్‌ను తెచ్చి పెట్టింది. ఆపై వరుసగా స్టార్‌ హీరోల సరసన నటించే చాన్స్‌లు వచ్చాయి.

(చదవండి: చిరంజీవి కాకా వాయిదా.. నిర్మాత ఫుల్ క్లారిటీ..!)

ఇప్పుడు తమిళం, హిందీ భాషల్లో క్రేజీ ఆఫర్లను అందుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు కోలీవుడ్‌ శ్రీలీల మూడు చిత్రాల్లో నటిస్తున్న నటిస్తుండడం విశేషం. అవన్నీ భారీ చిత్రాలు కావడం మరో విశేషం. ఇక్కడ మొదట్లో పుష్పా 2 చిత్రంలో కిసిక్కు అంటూ సాగే ఐటమ్‌ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చి కురక్రారును గిలిగింతలు పెట్టించిన శ్రీలీల ఆ తర్వాత పరాశక్తి చిత్రంతో కథానాయికిగా పరిచయమై తన నటనతో మంచి మార్కులు కొట్టేశారు. 

తాజాగా నటుడు ధనుష్‌కు జంటగా ఓం చిత్రం, రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న ధర్మన్‌ చిత్రంతో పాటు అజిత్‌కు జంటగా డేర్‌ డెవిల్‌ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇలా ఒకేసారి మూడు తమిళ చిత్రాల్లో నటిస్తూ తమిళ ప్రేక్షకులను కిసిక్కు కనిపించబోతున్నారు. అదే విధంగా హిందీలోనూ రెండు చిత్రాల్లో నటిస్తూ పాన్‌ ఇండియా కథానాయికిగా పేరు తెచ్చుకున్నారు. త్వరలో నటిగా దశకం లోకి అడుగు పెడుతున్న ఈ 25 ఏళ్ల బ్యూటీ పయనం ఆశ్చర్య పరుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement