సూర్య సీన్‌ మూవీ.. ప్రతి సీన్‌లోనూ అదే రిపీట్..! | Kollywood Hero Suriya Different Style in Scene Movie | Sakshi
Sakshi News home page

Scene Movie: సూర్య సీన్‌ మూవీ.. ప్రతి సీన్‌లోనూ అదే రిపీట్..!

Nov 7 2026 3:40 AM | Updated on Nov 7 2026 3:40 AM

Kollywood Hero Suriya Different Style in Scene Movie

ఈ ఏడాది ఇప్పటికే విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీతో హిట్‌ కొట్టిన సూర్య మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆయన హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ సీన్. ఈ చిత్రం ఇవాల్టి నుంచే థియేటర్లలో సందడి చేస్తోంది. కోలీవుడ్ డైరెక్టర్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ దీపావళి బాక్సాఫీస్ బరిలో నిలిచింది. ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక తమ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. 

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ టాక్ వైరలవుతోంది. ఈ సినిమాలో సూర్య సరికొత్త స్టైల్‌ ఆడియన్స్‌ షాకవుతున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్‌ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.ఈ చిత్రంలోని ప్రతి ఒక్క సీన్ లోనూ సూర్య కేవలం షార్ట్స్ ధరించి కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఒకే రకమైన ఈ కాస్ట్యూమ్ ట్రెండ్‌ కంటిన్యూ చేయడం ఒక కమర్షియల్ స్టార్ హీరో కెరీర్‌లో చాలా అరుదైన విషయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 

సూర్య రెగ్యులర్ మాస్ ఇమేజ్‌ను పక్కన పెట్టడంపై ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సరికొత్త క్యారెక్టర్ ప్రెజెంటేషన్ థియేటర్లలో ప్రేక్షకులకు ఒక డిఫరెంట్‌గా అనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో నజ్రియా హీరోయిన్‌గా నటించారు.  ఈ చిత్రంలో యంగ్ హీరో నస్లెన్ సైకో కిల్లర్ విలన్ రోల్‌లో అదరగొట్టేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement