బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టైసన్ నాయుడు. ఈ చిత్రంలో నేహాశెట్టి హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీకి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాక్సింగ్ లెజెండ్ మైక్‌టైసన్ అభిమానిగా నటిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. మదరాసి రబ్బరు బొమ్మ అంటూ సాగే మాస్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు సురేష్ గంగుల లిరిక్స్ అందించగా.. నల్గొండ గద్దర్ నర్సన్న, రోహిణి సోరట్ ఆలపించారు. ఈ పాటను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. కాగా.. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, నరేష్, రావు రమేష్, సత్య, వెన్నెల కిషోర్, ప్రవీణ్, ప్రవీణ, శత్రు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


