కీర్తికి అమ్మాయిలు కనెక్ట్‌ అవుతారు: అనస్వర రాజన్‌ | Anaswara Rajan about on Itlu Arjuna Movie | Sakshi
Sakshi News home page

కీర్తికి అమ్మాయిలు కనెక్ట్‌ అవుతారు: అనస్వర రాజన్‌

Nov 7 2026 4:07 AM | Updated on Nov 7 2026 4:07 AM

Anaswara Rajan about on Itlu Arjuna Movie

‘‘నేను స్టార్‌ హీరోయిన్‌ హోదా కోసం పరిగెత్తాలనుకోవడం లేదు. మంచి సినిమాలు చేస్తూ, ప్రేక్షకులతో మంచి నటిగా గుర్తింపు పొందాలనుకుంటున్నాను’’ అని అనస్వర రాజన్‌ అన్నారు. అనీష్, అనస్వర రాజన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఇట్లు అర్జున’. అక్కినేని నాగార్జున సమర్పణలో మహేష్‌ ఉప్పల దర్శకత్వంలో వెంకీ కుడుముల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా శుక్రవారం విలేకరుల సమావేశంలో అనస్వర మాట్లాడుతూ– ‘‘నేను తెలుగులో సైన్‌ చేసిన తొలి సినిమా ‘ఇట్లు అర్జున’. కానీ నేను హీరోయిన్‌గా నటించిన ‘చాంపియన్‌’ చిత్రం ముందుగా విడుదలైంది. అర్జున్‌ (హీరో అనీష్‌ పాత్ర పేరు), కీర్తీ ప్రేమకథే ఈ సినిమా.

యాక్షన్, ఎమోషన్, సస్పెన్స్, థ్రిల్‌ వంటి అంశాలు కూడా ఈ చిత్రంలో ఉంటాయి. ఇందులో నేను చేసిన కీర్తి రోల్‌ ప్రతి అమ్మాయి కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది. ప్రస్తుతం చిరంజీవిగారి ‘కాకా’, రవితేజగారి ‘తులాభారం’, సంగీత్‌ శోభన్‌ ‘అంతా రాములోరు చూస్కుంటారు’ వంటి సినిమాలు చేస్తున్నాను’’ అని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement