నాగచైతన్య సతీమణి శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం తొలినాళ్లలో చాలా భయపడ్డానని ఆమె తెలిపారు. ఇండస్ట్రీలో తనకంటూ గాడ్ ఫాదర్ ఎవరూ లేరని వెల్లడించారు. అందుకే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టడం చాలా కష్టమని నటి శోభిత అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన సినీ కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.
శోభిత మాట్లాడుతూ..'నా కాలేజీ రోజుల్లో ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీలు చూసినప్పుడు.. నాలాంటి వారికి ఆ స్థాయికి చేరుకోవడం అసాధ్యమని అనుకునేదాన్ని. కానీ ఎన్నో ఆడిషన్ల తర్వాతే నాకు తొలి సినిమా అవకాశం వచ్చింది. కేన్స్‌కి వెళ్లినప్పుడు ఎంతో మంది గొప్పవాళ్లను అక్కడ కలిశా. వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. అనుకుంటే ఏదైనా సాధించొచ్చని అప్పుడే అర్థమైంది. ఇదొక సర్కస్ లాంటిదని,.. ఇక్కడ మన టాలెంట్‌కు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదని తెలుసుకున్నా. ఆ తర్వాతే నాకు భయం పోయింది. కానీ, ఈ స్థాయికి రావడానికి చాలా ధైర్యం కావాలి' అని తెలిపింది. కాగా.. శోభిత ప్రస్తుతం పా.రంజిత్ దర్శకత్వంలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ వేట్టువంలో కనిపించనుంది.


