కాంతి పిక్చర్స్ అధినేత శ్రీ ఎన్.వి రెడ్డి గారి మరణం ఎంతో బాధ కలిగించిందని దర్శకుడు వీవీ వినాయక్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచించారు. శ్రీ ఎన్.వి. రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని సంతాపం ప్రకటించారు.
వీవీ వినాయక్ మాట్లాడుతూ.. ''కాంతి పిక్చర్స్ అధినేత శ్రీ ఎన్.వి. రెడ్డి మా అందరికీ దూరం కావడం నాకు ఎంతో బాధ కలిగించింది. ఎన్.వి. రెడ్డిని.. ఆయన తమ్ముడు చిన్నరెడ్డిని చాలా దగ్గరగా చూశా. అన్నదమ్ముల అనుబంధం అంటే ఏమిటో నేర్చుకున్నాం. మా నాన్నగారు దూరమైనప్పుడు ఎలా బాధపడ్డానో, ఇప్పుడు కూడా అంతే బాధగా ఉంది.' అంటూ ఎమోషనల్ అయ్యారు.


