అనస్వర, అనీష్
అనీష్, అనస్వర రాజన్ జంటగా నటించిన సినిమా ‘ఇట్లు అర్జున’. మహేష్ ఉప్పల దర్శకత్వంలో దర్శకుడు వెంకీ కుడుముల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘ఎల్లో చున్ని’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో నిర్వహించారు మేకర్స్. శ్రీజో లిరిక్స్ అందించిన ఈ పాటను ఈ చిత్రం సంగీత దర్శకుడు తమన్‌తో కలిసి విశాల్ మిశ్రా పాడారు. ఈ వేడుకలో అనీష్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలోని ‘ఎల్లో సాంగ్ నా ఫేవరెట్’.
ఒక అమ్మాయి నవ్వితే ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో చెప్పే పాట ఇది’’అని చెప్పారు. ‘‘ఈ సినిమాలోని ప్రేమకథకు అనీష్, అనస్వర తమ నటనతో ప్రాణం పోశారు’’ అని తెలిపారు మహేష్. ‘‘ఇట్లు అర్జున’ సినిమా లవ్లీ జర్నీ. సాధారణంగా మ్యూజిక్ విషయంలో ‘థియేటర్లు పగిలి పోవాలి.. స్పీకర్లు కాలిపోవాలి’ అని నాకు మెసేజ్‌లు పెడుతుంటారు. కానీ మహేష్ వచ్చి ‘గుండె పగిలిపోవాలి’ అని చెప్పాడు’’ అని తమన్ పేర్కొన్నారు. ‘‘అబ్బాయిలు, అమ్మాయిలందరికీ ఈ పాటను అంకితం చేస్తున్నాను’’ అని తెలిపారు అనస్వర రాజన్. ఈ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ ఫాల్గుణి మాట్లాడారు.


