breaking news
Itllu Arjuna Movie
-
‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్ లైవ్ కన్సర్ట్ ఈవెంట్ (ఫోటోలు)
-
‘ఆదర్శకుటుంబం’ వాయిదా.. ఈసారైనా చెప్పిన తేదీకి రండి : నాగార్జున
అనీష్, అనస్వర రాజన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఇట్లు అర్జున’. మహేశ్ ఉప్పల దర్శకత్వంలో వెంకీ కుడుముల నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 30న విడుదల కానుంది. ఈ సినిమాను నాగార్జున స్వయంగా సమర్పిస్తున్నారు. ఈమేరకు ఈ రోజు (శుక్రవారం) మీడియా సమావేశం నిర్వహించింది చిత్ర బృందం. ఈ ఈవెంట్లో పాల్గొన్న హీరో నాగార్జున.. చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.పెద్ద సినిమాలు వస్తున్నాయంటూఅక్టోబర్ 30న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ మీ ‘ఇట్లు అర్జున’ థియేటర్లలోకి వస్తుందా? అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు నాగార్జున తనదైన శైలిలో బదులిచ్చారు. ‘మొదట అక్టోబర్ 2 అన్నారు. ఆ తర్వాత అక్టోబర్ 9 వస్తున్నట్లు ప్రకటించారు. తీరా చూస్తే పెద్ద సినిమాలు వస్తున్నాయంటూ వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ అక్టోబర్ 30 అంటున్నారు. ఈసారైనా అక్టోబర్ 30న వాయిదా పడకుండా రావాలని నేను కోరుకుంటున్నాను’ అంటూ నాగార్జున తన అభిప్రాయాన్ని వెల్లడించారు.అయితే కావాలని ఎవరూ డేట్లు బ్లాక్ చేయరని, పరిస్థితుల వల్ల మిస్ అవుతాయని సర్దిచెప్పారు. ‘నేను డిసెంబర్ 24న వస్తున్నానని చెప్పాను. అందుకే ఆ మాట నిలబెట్టుకోవడానికి రాత్రి పగలు కష్టపడి సినిమా పనిమీదనే ఉన్నా. చెప్పిన తేదీకి రాకపోతే ఆ డేట్స్ ప్రకటించకూడదు’ అని చెప్పారు. (ఇదీ చదవండి: ‘జైలర్2’కు పైరసీ భూతం.. ఆన్లైన్లో HD ప్రింట్)Small Films Struggle Due to the Irresponsible Postponements of #AadarshaKutumbam!! https://t.co/QHt5UFZjoa— cinee worldd (@Cinee_Worldd) October 16, 2026 -
స్టార్ హీరోయిన్‌తో తమన్ డ్యాన్స్.. జోష్‌లో మ్యూజిక్ డైరెక్టర్..
టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అనీష్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఇట్లు అర్జున’. మహేశ్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. అక్టోబర్ 30న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.తాజాగా ఈ చిత్ర బృందం విశాఖపట్నంలోని గీతం కళాశాలలో మూడో పాట విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్లో సంగీత దర్శకుడు తమన్, హీరోయిన్ అనస్వర రాజన్ కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేశారు. వీరిద్దరి సందడి అక్కడున్న వారిని అలరించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.మూగవాడిగా అనీష్..‘ఇట్లు అర్జున’ సినిమాలో అనీష్ మూగవాడైన అర్జున పాత్రలో కనిపించనున్నాడు. అనస్వర రాజన్ కీర్తి పాత్రలో ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మరి అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి. (ఇదీ చదవండి: నానా పటేకర్ మృతి.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఎమోషనల్)Thaman & Anaswara Dance for #MaheshBabu's Kalavathi 😅 @MusicThaman @AnaswaraRajan_ #SSThaman #AnaswaraRajan #IttluArjuna https://t.co/J2UYQlit98— Jadal Targaryen (@ParodyPeaks) October 8, 2026 -
అమ్మాయి నవ్వితే..!
అనీష్, అనస్వర రాజన్ జంటగా నటించిన సినిమా ‘ఇట్లు అర్జున’. మహేష్ ఉప్పల దర్శకత్వంలో దర్శకుడు వెంకీ కుడుముల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘ఎల్లో చున్ని’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో నిర్వహించారు మేకర్స్. శ్రీజో లిరిక్స్ అందించిన ఈ పాటను ఈ చిత్రం సంగీత దర్శకుడు తమన్‌తో కలిసి విశాల్ మిశ్రా పాడారు. ఈ వేడుకలో అనీష్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలోని ‘ఎల్లో సాంగ్ నా ఫేవరెట్’. ఒక అమ్మాయి నవ్వితే ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో చెప్పే పాట ఇది’’అని చెప్పారు. ‘‘ఈ సినిమాలోని ప్రేమకథకు అనీష్, అనస్వర తమ నటనతో ప్రాణం పోశారు’’ అని తెలిపారు మహేష్. ‘‘ఇట్లు అర్జున’ సినిమా లవ్లీ జర్నీ. సాధారణంగా మ్యూజిక్ విషయంలో ‘థియేటర్లు పగిలి పోవాలి.. స్పీకర్లు కాలిపోవాలి’ అని నాకు మెసేజ్‌లు పెడుతుంటారు. కానీ మహేష్ వచ్చి ‘గుండె పగిలిపోవాలి’ అని చెప్పాడు’’ అని తమన్ పేర్కొన్నారు. ‘‘అబ్బాయిలు, అమ్మాయిలందరికీ ఈ పాటను అంకితం చేస్తున్నాను’’ అని తెలిపారు అనస్వర రాజన్. ఈ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ ఫాల్గుణి మాట్లాడారు.


