‘ఆదర్శకుటుంబం’ వాయిదా.. ఈసారైనా చెప్పిన తేదీకి రండి : నాగార్జున | Hero Nagarjuna Comments Aadarsha Kutumbam Release Date Postpone | Sakshi
Sakshi News home page

Nagarjuna Comments Aadarsha Kutumbam: ‘చెప్పిన తేదీకి రాకపోతే ఎలా?’

Oct 16 2026 6:49 PM | Updated on Oct 16 2026 7:04 PM

Hero Nagarjuna Comments Aadarsha Kutumbam Release Date Postpone

అనీష్, అనస్వర రాజన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఇట్లు అర్జున’. మహేశ్‌ ఉప్పల దర్శకత్వంలో వెంకీ కుడుముల నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 30న విడుదల కానుంది.  ఈ సినిమాను నాగార్జున స్వయంగా సమర్పిస్తున్నారు. ఈమేరకు ఈ రోజు (శుక్రవారం) మీడియా సమావేశం నిర్వహించింది చిత్ర బృందం. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న హీరో నాగార్జున.. చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

పెద్ద సినిమాలు వస్తున్నాయంటూ
అక్టోబర్ 30న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ మీ ‘ఇట్లు అర్జున’ థియేటర్లలోకి వస్తుందా? అని ఓ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు నాగార్జున తనదైన శైలిలో బదులిచ్చారు. ‘మొదట అక్టోబర్ 2 అన్నారు. ఆ తర్వాత అక్టోబర్ 9 వస్తున్నట్లు ప్రకటించారు. తీరా చూస్తే పెద్ద సినిమాలు వస్తున్నాయంటూ వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ అక్టోబర్ 30 అంటున్నారు. ఈసారైనా అక్టోబర్ 30న వాయిదా పడకుండా రావాలని నేను కోరుకుంటున్నాను’ అంటూ నాగార్జున తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

అయితే కావాలని ఎవరూ డేట్లు బ్లాక్ చేయరని, పరిస్థితుల వల్ల మిస్ అవుతాయని సర్దిచెప్పారు. ‘నేను డిసెంబర్ 24న వస్తున్నానని చెప్పాను. అందుకే ఆ మాట నిలబెట్టుకోవడానికి రాత్రి పగలు కష్టపడి సినిమా పనిమీదనే ఉన్నా. చెప్పిన తేదీకి రాకపోతే ఆ డేట్స్‌ ప్రకటించకూడదు’ అని చెప్పారు. 

(ఇదీ చదవండి: ‘జైలర్‌2’కు పైరసీ భూతం.. ఆన్‌లైన్‌లో HD ప్రింట్‌)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement