బీజేపీ మంత్రి రేఖా ఆర్య, భర్తపై సంచలన ఆరోణలు..! | Uttarakhand minister Rekha Arya accuses husband of assault he releases video | Sakshi
Sakshi News home page

బీజేపీ మంత్రి రేఖా ఆర్య, భర్తపై సంచలన ఆరోణలు..!

Oct 16 2026 3:27 PM | Updated on Oct 16 2026 3:57 PM

Uttarakhand minister Rekha Arya accuses husband of assault he releases video

ఉత్తరాఖండ్‌ బీజేపీ మంత్రి రేఖా ఆర్య,  ఆమె భర్త గిర్ధారీ లాల్ సాహు మధ్య విభేదాలు  రచ్చకెక్కాయి.  తన భర్త తనను హత్య చేయాలని చూశారని, కుల వివక్ష వేధింపులకు గురిచేశారనే సంచలన ఆరోపణలతో రేఖా ఆర్య పోలీసులను ఆశ్రయించారు. డెహ్రాడూన్ కంటోన్మెంట్ పోలీసు స్టేషన్‌లో ఈ మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదైంది. 

మరోవైపు  రేఖా ఆర్యకు కౌంటర్‌గా ఆమె భర్త గిర్ధారీ లాల్ సాహు శుక్రవారం ఒక సంచలన వీడియోను విడుదల చేశారు. తన భార్య అవినీతికి పాల్పడిందని ఆరోపించడమే కాకుండా,  ఏఐ ద్వారా సృష్టించిన ఆడియో క్లిప్ ఆధారంగా తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. అంతేకాదు పోలీసులను ఆశ్రయించిన రేఖా ఆర్య నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ, తనపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని  కూడా ఆయన డిమాండ్ చేశారు.

ఈ వీడియోలో "ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావంటే, అది నా వల్లే" అంటూ ఆయన బార్యపై  తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేఖా ఆర్య తాను జీవితాంతం మంత్రిగా కొనసాగుతానని నమ్ముతోందని, ఆమె రాజకీయ ఎదుగుదలలో తాను కీలక పాత్ర పోషించానని సాహు ఆరోపించారు. అసలు తానే ఆమెను అధికారంలోకి తీసుకువచ్చానని, ఇది ఉత్తరాఖండ్ మొత్తానికి తెలుసునని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆమె తనపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోకపోతే 'బాబా బంఖండీ నాథ్' ఆమెను క్షమించరని హెచ్చరించారు. రేఖా అవినీతి అక్రమాల ద్వారా రూ. 200 కోట్లు కూడబెట్టారని సాహు ఆరోపించారు. అక్టోబర్ 15న సాహుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన మరుసటి రోజే ఈ వీడియో బయటకు వచ్చింది.

FIR होने के बाद मंत्री रेखा आर्य के पति गिरधारीलाल साहू ने भी पत्नी के वीडियो के जवाब में पलटवार किया, अर्धनग्न अवस्था में गाड़ी में बैठकर बनाये गए वीडियो में साहू ने कहा कि,,,, “रेखा आर्य के भ्रष्टाचार के पैसे कभी नहीं लिए, मैंने हमेशा भ्रष्टाचार करने से मना किया, अगर तुमने मेरे ऊपर लगाए आरोप वापस नहीं लिए तो बाबा बनखंडी नाथ तुम्हें माफ नहीं करेंगे, जहाँ आज तुम हो मेरी वजह से हो, तुम सोचती हो कि हमेशा मंत्री रहोगी, लेकिन ऐसा नहीं होगा” @rekhaaryaoffice @pushkardhami @PMOIndia @RahulGandhi @BJP4India @INCIndia

— Ajit Singh Rathi (@AjitSinghRathi) October 16, 2026

భర్తపై రేఖా ఆర్య ఫిర్యాదు
ఉత్తరాఖండ్ మహిళా  మరియు  శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య తన భర్తపై సంచలన ఆరోపణలు చేశారు. గిర్ధారీ లాల్ సాహు తనకు మొదటి వివాహం జరిగిన విషయాన్ని దాచిపెట్టాడని, తనను శారీరకంగా హింసించాడని, బెదిరించాడన్నారు. తన భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని, ఇతర మహిళలతో సంబంధాల గురించి ప్రశ్నిస్తే తనపై దాడి చేసి చంపుతానని బెదిరించాడని ఆమె తెలిపారు.  అలాగే తన ఫిర్యాదులో ఒక ఆడియో రికార్డింగ్‌ను కూడా ఉటంకిస్తూ, ఆమెను, ఆమె పిల్లలను హత్య చేయడానికి కుట్ర జరిగిందని ఆరోపించారు.

తాను షెడ్యూల్డ్ కులానికి (SC) చెందిన వ్యక్తినని తెలిసి కూడా, ప్రభుత్వ నివాసంలో సిబ్బంది ముందే కులంపేరుతో దూషించి, అవమానించాడని ఆరోపించారు. తన ప్రమేయం లేకుండా, తన సంతకాలను ఫోర్జరీ చేసి కంపెనీల డైరెక్టర్ పదవుల నుండి తనను తొలగించాడని ఆరోపించారు. తన మొదటి పెళ్లి  గురించి దాచిపెట్టారని, విషయం తెలిసిన తరువాత కూడా   పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాను మౌనంగా ఉండిపోయానన్నారు.  అలాగే క్షమాపణలు చెప్పినప్పటికీ సాహూ తన వివాహేతర  సంబంధాలను ఆరోపించారు. తన పిల్లలను రక్షించుకునేందుకు  పోలీసులను ఆశ్రయించానన్నారు. సామాజిక హోదాతో సంబంధం లేకుండా, గృహ హింసకు వ్యతిరేకంగా మహిళలు మౌనంగా ఉండకూడదని  మంత్రి కోరారు. తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈమె ఫిర్యాదు  మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు

కాగా  రేఖా ఆర్య తన భర్తపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడంతో, పాత విషయాలు మళ్లీ వార్తల్లోకి వచ్చాయి.  ముఖ్యంగా 2024 సెప్టెంబర్‌లో, బరేలీకి చెందిన మరో కేసు కూడా మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రేఖా ఆర్య చేసిన ఆరోపణల ప్రకారం, కల్పనా మిశ్రా అనే మహిళ తన ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ వంటి పత్రాలలో గిర్ధారి లాల్ సాహును తన భర్తగా పేర్కొంది.

ఇదీ చదవండి: యూపీ ఎన్నికలపై అఖిలేష్‌ జోస్యం, ఈసీపై సంచలన వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement