14 ఏళ్ల బాలింత, 20 ఏళ్ల భర్త.. పుట్టింటికి వెళ్తానన్నందుకు ఘోరం! | 14 Year Old Girl Beaten to Death by Husband Days After Childbirth in iran | Sakshi
Sakshi News home page

14 ఏళ్ల బాలింత, 20 ఏళ్ల భర్త.. పుట్టింటికి వెళ్తానన్నందుకు ఘోరం!

Nov 28 2026 9:09 AM | Updated on Nov 28 2026 9:17 AM

14 Year Old Girl Beaten to Death by Husband Days After Childbirth in iran

టెహ్రాన్‌: ప్రసవం తర్వాత ప్రతి ఆడపిల్ల కోరుకునేది పుట్టింటి ఆదరణ. కానీ, ఆ చిరు కోరికే ఓ పసిమొగ్గ ప్రాణాలను బలితీసుకుంది. ‘ఏవండీ.. ప్రసవం తర్వాత ఎందుకో పుట్టింటికి వెళ్లాలనిపిస్తోంది, వెళ్లొస్తానండి’ అని అడిగిన పాపానికి కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు.

ఇరాన్ మానవ హక్కుల కమిషన్  వెల్లడించిన వివరాల ప్రకారం.. కెర్మాన్ ప్రావిన్స్‌కు చెందిన 14 ఏళ్ల సోగాండ్ మోష్టారేకికి 20 ఏళ్ల యువకుడితో బలవంతపు వివాహం జరిగింది. ఇటీవల ఆమె ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదంలో మృత్యువును జయించింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

అయితే, ప్రసవం తర్వాత పుట్టింటికి వెళ్లాలని ఉందని కోరడం భర్తకు కోపాన్ని తెచ్చింది. ఆగ్రహంతో ఆమెను హతమార్చాడు. మొదటి నుంచీ భర్త ఆమెను పుట్టింటి వారితో కలవనివ్వకుండా, బయటకు వెళ్లినప్పుడల్లా ఇంట్లోనే బంధించి ఉంచేవాడని ఐహెచ్ఆర్ పేర్కొంది.

ఇరాన్‌లో ఆగని బలవంతపు వివాహాల విషాదం
ఫార్స్ ప్రావిన్స్‌కు చెందిన 21 ఏళ్ల గర్భిణి సెపిదే రైసీని ఆమె భర్త హత్య చేసిన రోజే ఈ ఘటన కూడా జరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో బలవంతపు బాల్య వివాహాలు, పితృస్వామ్య వ్యవస్థ, వివక్షాపూరిత చట్టాల వల్లే మహిళలపై ఇటువంటి దారుణాలు పెరిగిపోతున్నాయని మానవ హక్కుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement