కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు | Indian Origin Man In US assassinated Wife For Dating Colleague Tries To Go To India | Sakshi
Sakshi News home page

కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు

Oct 16 2026 12:32 PM | Updated on Oct 16 2026 2:29 PM

Indian Origin Man In US assassinated Wife For Dating Colleague Tries To Go To India

భారత సంతతికి  చెందిన అంకుర్ పటేల్‌ దారుణానికి తెగబడ్డాడు.  మూడు నెలల క్రితం విడిపోయిన భార్యను ఇంటికి పిలిచి మరీ దారుణంగా హత్య చేశాడు. సహోద్యోగితో డేటింగ్ చేస్తోందనే అక్కసుతో ఆమెను  కత్తితో పొడిచి చంపేశాడు. అమెరికాలోని చికాగోలో ఈ ఘటన  చోటు  చేసుకుంది.

అంకుర్ పటేల్ భార్యతో ఈ ఏడాది ఆగస్టులో విడిపోయారు. వీరికి ఒక కుమార్తె ఉంది. విడిపోయిన తరువాత విస్కాన్సిన్ ఇంటి నుండి వెళ్లిపోయింది. అయితే ఆమె తన మాజీ సహోద్యోగులలో ఒకరితో డేటింగ్‌లో ఉందని అంకుర్‌కు తెలిసింది. దీంతో తనతో  రాజీ పడాలని కోరాడు.  ఈ ప్రతిపాదనకు ఆమె నిరాకరించింది.  తన కొత్త భాగస్వామితోనే ఉంటానని చెప్పింది. దీంతో భార్యపై కక్ష పెంచుకున్నాడు. పాపను కలవనీయకుండా చేశాడు. అంతేకాదు సుమారు రెండు వారాల ముందు,భార్యకు తెలియకుండా పాపను భారతదేశంలోని తన తల్లిదండ్రుల వద్దకు పంపించేశాడు.

ఆ తరువాత కూతురిని చూపిస్తానని చెప్పి భార్యను చికాగోలోని తన అపార్ట్‌మెంట్‌కు పటేల్ రప్పించాడు. అయితే, అప్పటికే పాప ఇండియా వెళ్లి పోయిందని తెలియని ఆమె తన కొత్త పార్టనర్‌తో కలిసి ఇంటికి వచ్చింది. తీరా పాప కూతురు లేకపోవడంతో అతణ్ని నిలదీసింది. తనతోనే కలిసి ఉండాలని మళ్లీ కోరాడు. దీనికి ఆమె ససేమిరా అంది. దీంతో ముందస్తు పథకం  ప్రకారం ఆమె గొంతులో కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడినుంచి  ఉడాయించాడు.

ఆ మహిళ భాగస్వామి ఆమెకు పదేపదే మెసేజెస్‌ పంపినా సమాధానం రాకపోడంతో అతను పోలీసులకు ఫోన్ చేశాడు.  పోలీసు అధికారులు  ఆ భవనానికి  వెళ్లినప్పటికీ, ఆమె వెళ్లిన  ఫ్లాట్‌ను ఆమె భాగస్వామి గుర్తించలేకపోవడంతో వారు వెనుదిరిగారు.  ఇంతలో ఆ రాత్రి పటేల్ కలవాల్సిన అతని స్నేహితులు అతను రాకపోవడంతో అతని అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. అక్కడ  వాషింగ్ మెషీన్ దగ్గర  అంకుర్‌  భార్య చనిపోయి ఉండటం, అంకుర్‌ ఆచూకీలేకపోవడంతో  ఈ నేరం వెలుగులోకి వచ్చింది. 

ఇదీ  చదవండి: జర్మనీలో అగ్నిప్రమాదం : ముగ్గురు భారతీయులు సజీవ దహనం

భారతదేశానికి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో అంకుర్‌ను విమానాశ్రయం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అతను నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం అతనిపై ఫస్ట్-డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement