‘జైలర్‌2’ ఓటీటీ డేట్‌ ఫిక్స్‌? స్ట్రీమింగ్‌ ఎక్కడంటే? | Jailer 2 OTT Release Date: When and Where to Watch Rajinikanth Film Online? | Sakshi
Sakshi News home page

Jailer 2 OTT Release Date: ఓటీటీలోకి ‘జైలర్‌2’..! స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Oct 16 2026 2:37 PM | Updated on Oct 16 2026 2:40 PM

Jailer 2 OTT Release Date: When and Where to Watch Rajinikanth Film Online?

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్‌ మూవీ జైలర్-2. గతంలో రిలీజైన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నెల్సన్ దిలీప్‌ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. దసరా కానుకగా ఈనెల 15న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.

తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. చిత్రం విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 125.25 కోట్లు వసూలు చేసిందని సమాచారం. ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది? ఏ వేదికపై స్ట్రీమింగ్‌ కానుందనే ఆసక్తి సినీ ప్రియుల్లో నెలకొంది.

(ఇదీ చదవండి: తొలి రోజే కలెక్షన్ల సునామీ.. జైలర్ 2కు ఎన్ని కోట్లంటే?)

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో..!
‘జైలర్‌ 2’ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ డీల్‌ రూ.160 కోట్లకు కుదిరినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సినిమా నవంబర్‌ 12, 2026న ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత డిజిటల్‌ ప్రీమియర్‌ ఉండేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా ఈ చిత్రంలో రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించగా.. రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రల్లో కనిపించారు. మిథున్‌ చక్రవర్తి, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌ తదితరులు ఈ చిత్రంలో భాగమయ్యారు. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ నిర్మించింది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతాన్ని అందించారు. వివిధ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు ఈ సినిమాలో భాగం కావడంతో తమిళంతో పాటు ఇతర భాషల ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరిగింది.

(ఇదీ చదవండి: ‘జైలర్‌ 2’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement