తొలి రోజే కలెక్షన్ల సునామీ.. జైలర్ 2కు ఎన్ని కోట్లంటే? | Rajinikanth Jailer 2 Movie Day 1 Worldwide Box Office Collections Details, Check Out Latest Numbers Inside | Sakshi
Sakshi News home page

Jailer 2 Collections: తొలి రోజే జైలర్ 2 సునామీ.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Oct 16 2026 12:03 PM | Updated on Oct 16 2026 12:29 PM

Rajinikanth Latest Movie Jailer 2 box office Day 1 Collections

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్‌ మూవీ జైలర్-2. గతంలో రిలీజైన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నెల్సన్ దిలీప్‌ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. దసరా కానుకగా ఈనెల 15న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది.

తొలిరోజే ఈ సీక్వెల్ కళ్లు చెదిరే ఓపెనింగ్స్ రాబట్టింది.  చిత్రం విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 125.25 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ సైట్ శాక్‌నిల్క్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా చూస్తే రూ.70.25 కోట్ల గ్రాస్‌తో పాటు రూ.59.70 కోట్ల  నెట్ వసూళ్లు సాధించింది. ఓవర్‌సీస్‌లో ఏకంగా  రూ.55 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజున అన్ని భాషలలో కలిపి 55.4 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. దేశీయ వసూళ్లలో తమిళ వర్షన్ అగ్రస్థానంలో నిలవగా.. ఆ తర్వాత తెలుగు, హిందీ వర్షన్లు నిలిచాయి. కన్నడ వర్షన్‌లో మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. దేశీయ వసూళ్లలో తమిళ వర్షన్ రూ.43.35 కోట్లు, తెలుగు వర్షన్ రూ.12.50 కోట్లు, హిందీ వర్షన్ రూ.3.50 కోట్లు వసూలు చేశాయి. కన్నడ వర్షన్ రూ.35 లక్షల నెట్ వసూళ్లు మాత్రమే రాబట్టింది

కాగా.. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కలానిధి మారన్ నిర్మించారు. రజనీకాంత్ టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో తిరిగి నటించగా.. రమ్య కృష్ణన్, యోగి బాబు, మీర్నా, ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్, సూరజ్ వెంజరమూడు  కీలక పాత్రల్లో మెప్పించారు. అంతేకాకుండా మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, హృతిక్ రోషన్  ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా.. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement