ముగిసిన ఇఫీ వేడుకలు | 57th IFFI Wraps Up in Goa With a Spectacular Closing Ceremony | Sakshi
Sakshi News home page

ముగిసిన ఇఫీ వేడుకలు

Nov 29 2026 12:16 AM | Updated on Nov 29 2026 12:16 AM

57th IFFI Wraps Up in Goa With a Spectacular Closing Ceremony

గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌తో రిషబ్‌ శెట్టి

‘అక్వి’కి గోల్డెన్‌ పీకాక్‌ పురస్కారం 

ఉత్తమ నటుడు రిషబ్‌ శెట్టి

గోవా వేదికగా ఈ నెల 20న ప్రారంభమైన 57వ ఇఫీ (ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా) వేడుకలు శనివారం (నవంబరు 28) ముగిశాయి. ‘సరిహద్దులు లేని కథలు’ థీమ్‌తో ఈ వేడుకలు జరిగాయి. పోలిష్‌ దర్శకుడు పావెల్‌ పావ్లికోవ్స్కీ తెరకెక్కించిన ‘ఫాదర్‌ ల్యాండ్‌’ సినిమాతో ఈ చిత్రోత్సవాలు ప్రారంభమై, సింగపూర్‌ దర్శకుడు ఆంథోనీ చెన్‌ తెరకెక్కించిన ‘ఉయ్‌ ఆర్‌ ఆల్‌ స్ట్రేంజర్స్‌’ అనే మూవీ ప్రదర్శనతో ముగిశాయి. 

బాలీవుడ్‌ దర్శకుడు అశుతోష్‌ గోవారీకర్‌ ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ వేడుకల్లో ‘ఫిల్మ్స్‌ ఫ్రమ్‌ బ్రిక్స్‌’ విభాగం ప్రారంభ చిత్రంగా ‘రామాయణ పార్ట్‌ 1’ ప్రదర్శితమైంది. ఈ చిత్రోత్సవాల్లో ప్రతిష్ఠాత్మక గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు (ఉత్తమ చిత్రం) పోర్చుగీసు దర్శకుడు టియాగో గుడెస్‌ తెరకెక్కించిన స్పెయిన్‌ భాష చిత్రం ‘అక్వి’కి లభించింది. 

కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి ఉత్తమ నటుడిగా (‘కాంతార: ఎ లెజెండ్‌ చాప్టర్‌1’), మాయా ఓ’రూర్క్‌ ఉత్తమ నటిగా (‘ది మెల్ట్‌ డౌన్‌’) అవార్డులు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడి విభాగంలో ‘విజిటేషన్‌’ సినిమాకు జర్మన్‌ ఫిల్మ్‌ మేకర్‌ వోల్కర్‌ ష్లొండార్ఫ్‌ సిల్వర్‌ పీకాక్‌ అవార్డు సాధించారు. ఉత్తమ తొలి భారతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ దర్శకుడి అవార్డును డా. విశాల్‌ చతుర్వేది (‘హనుమాన్‌ అంశ్‌’) సాధించారు. రాబీ గ్రేవాల్‌ దర్శకత్వం వహించిన హిందీ సిరీస్‌ ‘మేడ్‌ ఇన్‌ ఇండియా: ఎ టైటాన్‌ స్టోరీ’కు ఉత్తమ వెబ్‌ సిరీస్‌ అవార్డు లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement