రామ్ చరణ్ - సుకుమార్ కాంబో.. హీరోయిన్‌ రేసులో తెలుగమ్మాయిలు..! | Ram Charan and Sukumar Combo RC17 Actress Name Goes Viral | Sakshi
Sakshi News home page

RC17 Movie: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. హీరోయిన్‌ రేసులో తెలుగమ్మాయిలు..!

Nov 28 2026 12:30 PM | Updated on Nov 28 2026 12:30 PM

Ram Charan and Sukumar Combo RC17 Actress Name Goes Viral

టాలీవుడ్‌ డైరెక్టర్ సుకుమార్- మెగా హీరో రామ్ చరణ్ మరోసారి జతకట్టారు. రంగస్థలం లాంటి సూపర్ హిట్ తర్వాత వీరిద్దరు కలిసి పని చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఆర్సీ17 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌ను పూజా కార్యక్రమాలతో అఫీషియల్‌గా ప్రారంభించారు. వచ్చేనెలలో రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ నటీనటుల కోసం ప్రకటన కూడా ఇచ్చారు. ఈ మూవీలో నటించాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు.

ఆర్సీ17 పనులతో ఫుల్ బిజీగా ఉన్నారు మేకర్స్. అదే సమయంలో ఈ మూవీలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇటీవల ఆకాశంతో ఒకతార సినిమాతో హిట్‌ కొట్టిన సాత్విక వీరవల్లి పేరు తాజాగా వినిపిస్తోంది. ఆమెతో ఇటీవలే ఆడిషన్ కూడా నిర్వహించారని టాలీవుడ్‌ టాక్ నడుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ సైతం కామెంట్స్ చేయడంతో ఆమెనేనా అని చర్చ మొదలైంది.

మరోవైపు రామ్ చరణ్ సరసన తెలుగమ్మాయి శ్రీగౌరీ ప్రియ కూడా వినిపిస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎంచుకుంటారా? లేదా మరిన్ని పేర్లు తెరపైకి వ‍స్తాయోమో రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మరిన్ని ఆడిషన్స్ తర్వాత రామ్ చరణ్ హీరోయిన్‌ను సుకుమార్‌ సెలెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతలోనే సాత్విక, శ్రీగౌరిప్రియ పేర్లు మాత్రం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో చెర్రీ సరసన కనిపించేది ఎవరనే విషయంపై క్లారిటీ రానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement