టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం మైసా అనే యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేశారు మేకర్స్. ఈ సినిమాకు రవీంద్ర పుల్లె దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలో విజయశాంతి ఓసేయ్ రాములమ్మ సాంగ్‌ను రీమిక్స్ చేశారు.
ఇదిలా ఉంటే ఎప్పుడు షూటింగ్‌లతో బిజీగా ఉండే రష్మిక తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. షూటింగ్ ముగిశాక ఇంట్లో తాను చేసే వర్కవుట్స్ వీడియోను షేర్ చేసింది. 'ఇది రష్మిక టీమ్.. పని పూర్తయ్యాక ఆమె ఇంటికి వెళ్తే ఇలాగే కనిపిస్తుంది' అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇందులో జిమ్ చేస్తూనే.. తన పెట్ డాగ్‌తో ఆడుకుంటూ కనిపించింది. ఈ ఫోటోలు, వీడియోలు నెట్టంట వైరల్‌గా మారాయి. ఇవీ చూసిన ఫ్యాన్స్ రష్మికపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.


