ఏడవకపోతే రూ.కోటి.. ఏడిస్తే రూ.లక్ష.. బెట్ ఓడిపోయిన సుక్కు | Sukumar Lost Bet With Allu Aravind Aakasamlo Oka Tara Movie | Sakshi
Sakshi News home page

Sukumar-Allu Aravind: ఖరీదైన బెట్ ఓడిపోయిన డైరెక్టర్ సుకుమార్

Nov 29 2026 12:02 AM | Updated on Nov 29 2026 12:02 AM

Sukumar Lost Bet With Allu Aravind Aakasamlo Oka Tara Movie

స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ కొత్త సినిమా బిజీలో ఉన్నాడు. దీనికి ఆడిషన్స్ జరుగుతున్నాయి. రాబోయే రెండు మూడు నెలల్లో షూటింగ్ మొదలయ్యే అవకాశముంది. ఇదలా ఉండగానే నిర్మాత అల్లు అరవింద్‌తో కాసిన ఓ పందెంలో సుక్కు ఓడిపోయాడు. ఫలితంగా ఆయనకు రూ.లక్ష చెక్ ఇచ్చాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అల్లు అరవింద్ ఓ నిర్మాతగా చేసిన లేటెస్ట్ సినిమా 'ఆకాశంలో ఒక తార'. ఓ సాధారణ పల్లెటూరి అమ్మాయి, వ్యోమగామి కావాలనుకునే కల కని, దాన్ని ఎలా సాకారం చేసుకుందనేది ఎమోషనల్‌గా చూపించారు. బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన ఆదరణ దక్కించుకున్న ఈ చిత్రాన్ని చూసిన తర్వాత కన్నీళ్లు పెట్టుకోకపోతే రూ.కోటి రూపాయలు ఇస్తానని అల్లు అరవింద్, సుకుమార్‌తో చెప్పారు. ఒకవేళ ఏడవకపోతే మాత్రం తనకు రూ.లక్ష ఇవ్వాలని అరవింద్ కండీషన్ పెట్టారు.

ఈ క్రమంలోనే తాజాగా సుకుమార్, ఆకాశంలో ఒక తార సినిమా చూశారు. అల్లు అరవింద్ చెప్పినట్లే కన్నీళ్లు పెట్టుకున్నారు. అలా పందెంలో ఓడిపోయారు. ముందే అనుకున్నట్లు రూ.లక్ష చెక్‌ని అల్లు అరవింద్‌కి ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫొటోని తన ఇన్ స్టాలో సుక్కూ షేర్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement