ప్లీజ్‌.. ఆ పది నిమిషాలు మిస్‌​ కావొద్దు: వృషకర్మ డైరెక్టర్‌ | Vrushakarma director karthik says not to miss first 10minutes | Sakshi
Sakshi News home page

Vrushakarma: ఆ పది నిమిషాలు మిస్‌​ కావొద్దు: వృషకర్మ డైరెక్టర్‌

Nov 28 2026 9:02 PM | Updated on Nov 28 2026 9:03 PM

Vrushakarma director karthik says not to miss first 10minutes

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘వృషకర్మ’. డిసెంబర్‌ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది.  తాజాగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఇందులో డైరెక్టర్‌ కార్తీక్ దండు ప్రేక్షకులకు కీలక సూచనలు చేశారు

ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కావద్దు
‘విరూపాక్ష’లాగే..‘వృషకర్మ’ ఓ డిఫరెంట్‌ హారర్‌ మూవీ. వృషకర్మలో కూడా హీరోయిన్ చుట్టూ ఓ పెద్ద ట్విస్ట్ ఉంటుంది.  తెలుగు సినిమా గర్వపడేలా ఈ చిత్రం ఉంటుంది. ఇది థియేటర్ లో చూడాల్సిన సినిమా.  చాలా కొత్త స్క్రీన్‌ప్లేతో ఉంటుంది. ఈ సినిమా మొదలైన తొలి పది నిమిషాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కావద్దు. ఎందుకంటే తరువాత వచ్చే లాజిక్స్‌ అస్సలు అర్థం కావు. మీకు ఇదే నా రిక్వెస్ట్‌’ అని అన్నారు.  కాగా  కార్తిక్‌ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా కనిపించనున్నారు. 

(ఇదీ చదవండి: సీత పాత్రపై ట్రోలింగ్‌.. స్పందించిన సాయిపల్లవి)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement