అరవింద్‌ గారు.. నా కోరిక తీర్చండి: డైరెక్టర్‌ రాజమౌళి | Director Rajamouli About Allu Aravind | Sakshi
Sakshi News home page

అరవింద్‌ గారు.. నా కోరిక తీర్చండి: డైరెక్టర్‌ రాజమౌళి

Nov 28 2026 3:19 PM | Updated on Nov 28 2026 3:22 PM

Director Rajamouli About Allu Aravind

దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటించిన చిత్రం  ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా  పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళితో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ ఈవెంట్‌లో రాజమౌళి నిర్మాత అల్లు అరవింద్‌పై చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ‘గర్ల్‌ఫ్రెండ్, ఎంఎస్‌ సుబ్బులక్ష్మి లాంటి సినిమాలు అరవింద్‌ చేస్తున్నారు. ఇవన్నీ అవార్డు విన్నింగ్ సినిమాలే. కానీ నాకు ఒక కోరిక ఉంది. మీరు ఒక్కరే గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో మగధీర లాంటి సినిమా తీయాలి. అలా చేస్తేనే ఆ క్రెడిట్ అంతా మీకు దక్కుతుంది. లేదంటే ఆ మొత్తం యువ నిర్మాతలు కొట్టేస్తున్నారు’ అని అన్నారు. దీనికి అల్లు అరవింద్‌ సరే అని నవ్వుతూ సమాధానం చెప్పారు. 

 (ఇదీ చదవండి: రుహాణి.. నీతో ప్రైవేట్‌గా మాట్లాడుతా..: అల్లు అరవింద్‌)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement